Gautam Gambhir: ఆ బూతులు వాళ్ళకే.. క్లారిటీ ఇచ్చిన గంభీర్..
గంభీర్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో దీనిపై ఈ మాజీ ఓపెనర్ కూడా స్పందించాడు. తాను అలా చేసింది కోహ్లీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కాదని.. అక్కడ కొంతమంది భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తాను అలా చేశానని వివరణ ఇచ్చాడు.
Gautam Gambhir: భారత్– పాకిస్తాన్ మధ్య మూడు రోజుల క్రితం పల్లెకెలె వేదికగా జరిగిన కీలక మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తె లిసిందే. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా విధులు నిర్వర్తించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ చేసిన ఓ చర్య వివాదాస్పదమైంది. వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు కావడంతో గ్రౌండ్ నుంచి లోపలికి వెళ్తున్న గంభీర్‌ను ఉద్దేశిస్తూ పలువురు విరాట్ కోహ్లీ అభిమానులు ‘కోహ్లీ.. కోహ్లీ’ అని అరిచారు.
అది గమనించిన గంభీర్ వారికి మిడిల్ ఫింగర్ చూపిస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అయితే గంభీర్ కావాలనే అలా చేశాడని, ఇది కోహ్లీని అవమానించినట్టేనని అతడి అభిమానులు సామాజిక మాధ్యమాలలో మాజీ స్టార్ ఓపెనర్ గంభీర్‌ను దుమ్మెత్తిపోశారు. గంభీర్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో దీనిపై ఈ మాజీ ఓపెనర్ కూడా స్పందించాడు. తాను అలా చేసింది కోహ్లీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కాదని.. అక్కడ కొంతమంది భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తాను అలా చేశానని వివరణ ఇచ్చాడు. గంభీర్ స్పందిస్తూ… ‘మ్యాచ్‌ను చూసేందుకు వచ్చినప్పుడు రాజకీయ నినాదాలు చేయొద్దు.
నేను నా రూమ్‌కు వెళ్తుండగా అక్కడ కొంతమంది భారత్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. అంతేగాక కాశ్మీర్ గురించి కూడా నినాదాలు చేస్తుంటే నేను మౌనంగా ఉంటానని అనుకోకూడదు. అందుకే అలా చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియా ఎప్పుడూ, ఏ విషయాన్ని పూర్తిగా చూపించదు..’ అని స్పష్టం చేశాడు. కోహ్లీ.. కోహ్లీ అని అరిచినప్పుడు మాత్రమే తాను అలా వేలు చూపించానని చెప్పడానికి సంబంధమే లేదని గంభీర్ తెలిపాడు.