వారిని తీసిపారేయండి, బీసీసీఐకి గవాస్కర్ సలహా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోరపరాభవాన్ని టీమిండియా ఫ్యాన్స్ ఇప్పట్లో మరిచిపోయే పరిస్థితి లేదు.. అటు మాజీ ఆటగాళ్ళు సైతం భారత జట్టు ఆటతీరుపై మండిపడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2025 | 03:46 PMLast Updated on: Jan 08, 2025 | 3:46 PM

Get Rid Of Them Gavaskar Advises Bcci

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోరపరాభవాన్ని టీమిండియా ఫ్యాన్స్ ఇప్పట్లో మరిచిపోయే పరిస్థితి లేదు.. అటు మాజీ ఆటగాళ్ళు సైతం భారత జట్టు ఆటతీరుపై మండిపడుతున్నారు. బ్యాటర్ల ఫ్లాప్ షోతోనే సిరీస్ చేజారిందన్నది క్లియర్ గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టెస్ట్ జట్టుపై బీసీసీఐ ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జట్టును ప్రక్షాళణ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. మైదానంలో మనసు సగం పెట్టి.. మరో సగాన్ని ఎక్కడో ఉంచే ఆటగాళ్లు భారత జట్టులో వద్దని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లను గారాబం చేయవద్దని బీసీసీఐకి సూచించాడు.

గారాబం చేయడాన్ని ఆపాల్సిన సమయం వచ్చిందన్నాడు. ఇటీవలి ఫలితాలు చాలా నిరుత్సాహంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్‍కు మన జట్టు ఖచ్చితంగా చేరి ఉండాల్సిందన్నాడు. టీమిండియాలో కీలక మార్పులు చేయాల్సిన టైమ్ వచ్చిందన్నాడు. స్టార్ కల్చర్ ఇక ముగియాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆసీస్ టూర్ తో ఆత్మ పరిశీలన చేసుకునేందుకు మంచి టైమ్ గా చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్‍పై ప్రతీ ప్లేయర్ పూర్తి అంకితభావంతో ఉండాలన్నాడు. దీనిలో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్నాడు. నిజమైన మెడికల్ ఎమర్జెన్సీ తప్పిస్తే ప్లేయర్లు ప్రతీసారి జట్టుకు అందుబాటులో ఉండాల్సిందేనని చెప్పాడు. ఎవరైనా పూర్తి అంకితభావంతో లేకుంటే అలాంటి వారిని సెలెక్టర్లు జట్టులో నుంచి తీసిపాడేయాలని సూచించాడు.

కొందరిని ఆరాధించేలా చేయడాన్ని బీసీసీఐ తక్షణమే ఆపేయాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు అసలు వెనుకాడకూడదని చెప్పారు. పూర్తి ప్రాధాన్యతను భారత క్రికెట్‍కు ఇస్తారా.. వేరే వాటిపై దృష్టి పెడతారా అని స్పష్టంగా అడగాలన్నాడు.భారత క్రికెట్ ప్రాధాన్యతగా ఉన్న వారిని మాత్రమే సెలెక్ట్ చేయాలని గవాస్కర్ సూచించాడు. గవాస్కర్ వ్యాఖ్యలు కొందరు సీనియర్ ప్లేయర్స్ ను ఉద్దేశించే చేశాడని భావిస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ముఖ్యంగా రోహిత్ కేవలం 31 పరుగులే చేయగా.. అతని కంటే బుమ్రా, ఆకాశ్ దీప్ ఎక్కువ పరుగులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే చివరి టెస్టుకు రోహిత్ శర్మ తనంతట తానుగానే తప్పుకున్నాడు. తాను ఇప్పట్లో రిటైర్ అవడం లేదన్న క్లారిటీ కూడా ఇచ్చాడు. అటు కోహ్లీ కూడా ఆసీస్ టూర్ లో ఒకే ఒక్క సెంచరీ చేశాడు.