కింగ్ తో ప్రిన్స్ వివాదం, కోహ్లీ ఫ్యాన్స్ ను కెలికిన గిల్

ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. హోంగ్రౌండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాకిచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2025 | 03:55 PMLast Updated on: Apr 03, 2025 | 3:55 PM

Gill Upsets Kohli Fans Over Princes Dispute With King

ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. హోంగ్రౌండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాకిచ్చింది. ఆర్సీబీపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో సిరాజ్ నిప్పులు చెరగగా..ఆ తర్వాత ఛేజింగ్ లో బట్లర్, సాయి సుదర్శన్ దుమ్మురేపారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఛేజింగ్ లో గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. దీంతో ఈ సీజన్ లో ఆర్సీబీ తొలి ఓటమిని రుచి చూసింది. కాగా ఈ మ్యాచ్ తర్వాత గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ , విరాట్ కోహ్లీని టార్గెట్ చేసినట్టు కనిపించింది.సోషల్ మీడియాలో గిల్ పెట్టిన ఓ పోస్ట్ కొత్త వివాదానికి దారీ తీసింది. కోహ్లీ – గిల్ మధ్య ఏమైనా మనస్పర్థలు ఉన్నాయో, లేదంటే ఆర్సీబీ ఫ్యాన్స్ పై గిల్ మండిపడ్డాడో కానీ… కొత్త కాంట్రవర్సీ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ గెలవగానే ఆనందం వ్యక్తం చేసిన కెప్టెన్ గిల్.. ఆ తర్వాత ఓ క్రిప్టిక్ పోస్ట్ పెట్టాడు. మా దృష్టి ఆటపై ఉంది, అరిచి గోల చేయడంలో కాదు అని రాసుకొచ్చాడు. ఈ ఏడు పదాల పోస్ట్.. ఆర్సీబీ ఓటమి గురించే గిల్ పెట్టాడని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ పోస్ట్ లో చివరి మూడు పదాలు మాత్రంపై మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ గిల్ పడినప్పుడు కోహ్లీ అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి కౌంటర్ గానే అతను పోస్ట్ పెట్టాడని కొందరు అంటున్నారు. అయితే కోహ్లీ గ్రౌండ్ లో ఎప్పుడూ ఎనర్జిటిక్ గానే ఉంటూ వికెట్ పడినప్పుడు ఎమోషనల్ గానే రియాక్ట్ అవుతాడన్నది మరికొందరి అభిప్రాయం.

ఇదిలా ఇంటే చిన్నస్వామి స్టేడియంలో గట్టిగా అరుస్తూ గోల చేసిన RCB ప్రేక్షకుల గురించి పోస్ట్ పెట్టాడన్నది కొందరి వాదన. కానీ ఎక్కువ శాతం గిల్.. ఈ పోస్ట్‌ను విరాట్‌ను ఉద్దేశించే పెట్టాడని అంటున్నారు. మరి కొంత మంది గిల్ – కోహ్లీ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, గిల్ పెట్టిన పోస్ట్ కోహ్లీ గురించి కాదని అంటున్నారు. వారిద్దరు మ్యాచు సమయంలో కలిసి సరదాగా నవ్వుకుంటూ దిగిన ఫొటోను పోస్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది.. ఐపీఎల్ 2023లో ఆర్సీబీపై గుజరాత్ గెలిచినప్పుడు, గిల్ సోదరి షానీల్ పెట్టిన పోస్ట్ కు సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడు దానికి సమాధానంగానే గిల్.. తాజా రిప్లై ఇచ్చాడని అంటున్నారు. ఏదేమైనా గిల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఐపీఎల్ లో కోహ్లీ ఫ్యాన్స్ , గుజరాత్ ఫ్యాన్స్ మధ్య వార్ గా మారింది.
https://www.instagram.com/shubmangill/p/DH9EIX7SoMX/?hl=en