గిల్ కొత్త లవ్ స్టోరీ టీవీ నటితో డేటింగ్ ?

మన క్రికెటర్లు సినిమా సెలబ్రిటీలతో ప్రేమాయణాలు కొత్తేమీ కాదు... ఈ జాబితాలో చాలా మంది డేటింగ్ చేసుకున్నవాళ్ళున్నారు... లవ్ చేసుకుని పెళ్ళి చేసుకున్నవారు ఉన్నారు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2025 | 04:20 PMLast Updated on: Mar 12, 2025 | 4:20 PM

Gills New Love Story Is Dating A Tv Actress

మన క్రికెటర్లు సినిమా సెలబ్రిటీలతో ప్రేమాయణాలు కొత్తేమీ కాదు… ఈ జాబితాలో చాలా మంది డేటింగ్ చేసుకున్నవాళ్ళున్నారు… లవ్ చేసుకుని పెళ్ళి చేసుకున్నవారు ఉన్నారు… తర్వాత విడిపోయిన వారు కూడా ఉన్నారు… ఇప్పుడు టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్ కూడా ఓ టీవీ నటితో లవ్ స్టోరీ నడుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీవీ నటి అయిన అవనీత్ కౌర్‌తో శుభమన్ గిల్ డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల దుబాయ్‌లో ఆస్ట్రేలియా, టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌కి అవనీత్ వెళ్లింది. స్టేడియంలో ఎంజాయ్ చేసినట్లు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గిల్ కోసమే ఆమె మ్యాచ్ చూడటానికి వెళ్లిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గిల్ గతంలో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరినొకరు ఫాలో అవుతుండడం, పలు పార్టీల్లో కలిసి కనిపించడంతో లవ్ స్టోరీ అంటూ పుకార్లు వచ్చినా ఎవ్వరూ ధృవీకరించలేదు. దీంతో అవన్నీ రుమార్సేనని తేలిపోయింది. ఇప్పుడు అవనీత్ తో డేటింగ్ లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లకు పలువురు బాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు. ఇందులో అవనీత్ కౌర్ కూడా ఉంది. అయితే ఆమె ఈ మ్యాచ్ చూసేందుకు హాజరు కావడంతో.. గతంలో గిల్ అవినీత్ కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు.

అవినీత్ కౌర్.. గిల్ తో డేటింగ్ లో ఉన్నట్లు వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా గత సంవత్సరం గిల్ పుట్టినరోజు సందర్భంగా అవనీత్.. సోషల్ మీడియా వేదికగా అతడికి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు గిల్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలను మరోసారి వైరల్ చేస్తూ వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. అతడిని చూసేందుకే ఆమె దుబాయ్ స్టేడియానికి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇవన్నీ పుకార్లేనని.. ఆమె రాఘవ్ శర్మ అనే నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. 26 ఏళ్ల అవినీత్ కౌర్.. 8 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈమె పలు బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటించింది. మొదటిసారిగా 2010లో డ్యాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్ షో లో కనిపించింది. చివరిసారిగా 2024 లో వచ్చిన పార్టీ టిల్ ఐ డై అనే మర్డర్ మిస్టరీలో నటించింది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అవనీత్ కౌర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గానే ఉంటుంది.