Glenn Maxwell: నాన్ ఓపెనర్‌గా ఊరనాటు కొట్టుడు..
కెప్టెన్ పాట్ కమిన్స్ తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 202 పరుగుల రికార్డు అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో మూడు వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది.
Glenn Maxwell: వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు సాధించిన డబుల్ సెంచరీలన్నీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ నుంచి వచ్చినవే. సచిన్ టెండూల్కర్ అయినా, మార్టిన్ గప్టిల్ అయినా ఇలా అంతా ఓపెనర్లుగా బరిలోకి దిగి ఈ ఘనతను సాధించారు. అయితే మంగళవారం మ్యాక్స్‌వెల్ విభిన్నమైన ఫీట్ చేసి ఓపెనింగ్ చేయనప్పటికీ డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
ROHIT SHARMA: రోహిత్ శర్మపై మాజీ కోచ్ ప్రశంసలు
అఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా స్కోరు 7 వికెట్ల నష్టానికి 91 పరుగులుగా నిలిచింది. ఓటమి ఖాయం అనిపించినా గ్లెన్ మాక్స్‌వెల్ ఒంటిచేత్తో విజయాన్ని ఖాయం చేయడం గమనార్హం. కెప్టెన్ పాట్ కమిన్స్ తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 202 పరుగుల రికార్డు అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో మూడు వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది. తద్వారా సెమీఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. మొత్తానికి వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 11వ డబుల్ సెంచరీ.
ఈ ఇన్నింగ్స్ తో, వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచురీ చేసిన రెండో ఆటగాడిగా మ్యాక్సీ రికార్డు సృష్టించాడు. ఆసీస్ హార్డ్ హిట్టర్.. కేవలం 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొదటి స్థానంలో ఇషాన్ కిషన్ ఉన్నాడు. కిషన్, 2022 బంగ్లాదేశ్ పర్యటనలో కేవలం 126 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. మూడో స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. క్రిస్ గేల్, 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై 138 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.