IPL, Sunrisers : సన్ రైజర్స్ కు గోల్డెన్ ఛాన్స్
రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు మ్యాచ్‍ల్లో ఓడిపోవటంతో సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు మంచి ఛాన్స్ ముందుంది. టాప్-2లో ప్లేస్ దక్కించుకునే గోల్డెన్ ఛాన్స్ ఊరిస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు మ్యాచ్‍ల్లో ఓడిపోవటంతో సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు మంచి ఛాన్స్ ముందుంది. టాప్-2లో ప్లేస్ దక్కించుకునే గోల్డెన్ ఛాన్స్ ఊరిస్తోంది. సన్‍రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‍లు ఆడి ఏడు గెలిచి, ఐదు ఓడింది. ఇంకా లీగ్ దశలో హైదరాబాద్ రెండు మ్యాచ్‍లు ఆడాల్సింది. గుజరాత్‍తోమ్యాచ్ గెలిస్తే ఎస్ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. పంజాబ్‍తో మ్యాచ్‍లోనూ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది. అలాగే కోల్‍కతాపై రాజస్థాన్ ఓడాలి.. ఒకవేళ ఆర్ఆర్ గెలిచినా అది స్వల్ప తేడాతోనే అయి ఉండాలి. లేకపోతే హైదరాబాద్.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్‍ల్లో ఒకటి ఓడినా.. అది స్వల్పంగా ఉండాలి, అలాగే కోల్‍కతాతో మ్యాచ్‍ను రాజస్థాన్ ఎక్కువ తేడాతో ఓడాలి. ఈ రెండు సమీకరణాల్లో ఒకటి జరిగితే సన్‍రైజర్స్ రెండో స్థానాన్ని దక్కించుకుంటుంది. కాగా టాప్-2లో నిలిచిన జట్లకు ప్లేఆఫ్స్‌లో రెండు అవకాశాలు ఉంటాయి.