ఇషాన్ కు గాయం సంజూకు గోల్డెన్ ఛాన్స్
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ గురువారం నుంచి మొదలుకాబోతోంది. ఈ సారి పలువురు స్టార్ క్రికెటర్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు.
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ గురువారం నుంచి మొదలుకాబోతోంది. ఈ సారి పలువురు స్టార్ క్రికెటర్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. జాతీయ జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోవాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలతో రోహిత్, కోహ్లీ, బూమ్రా తప్పిస్తే దాదాపు మిగిలిన ఆటగాళ్ళంతా బరిలో ఉన్నారు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు చోటు దక్కించుకోవాలనుకుంటున్న యువ క్రికెటర్లు సైతం సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్ లకు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇషాన్ కిషాన్ బుచ్చి బాబు టోర్నమెంట్ లో గాయపడ్డాడు. అతని గాయంపై ఇంకా స్పష్టత రాకున్నా ముందు జాగ్రత్తగా టోర్నీకి దూరంగా ఉంటాడని సమాచారం.
దీంతో ఇషాన్ కిషన్ స్థానంలో కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసిన నాలుగు స్క్వాడ్ లో సంజు శాంసన్ కు చోటు దక్కలేదు. ఇప్పుడు మరో ఆటగాడి గాయం అతనికి అవకాశాన్ని కల్పించినట్టేనని చెప్పొచ్చు. దులీప్ ట్రోఫీలో రాణిస్తే బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం సంజూని సెలక్టర్లు పరిగణలోకి తీసుకునే ఛాన్సుంది. దులీప్ ట్రోఫీలో ఆడే జట్లకు వరుసగా శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.