T20,David Warner : టీ ట్వంటీ లకూ వార్నర్ గుడ్ బై.. చివరి మ్యాచ్ ఎప్పుడంటే ?
ప్రపంచ క్రికెట్ (World Cricket) లో డేవిడ్ వార్నర్ (David Warner) బ్యాటింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.. ఫార్మాట్ తో సంబంధం లేకుండా చెలరేగిపోయే వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ప్రపంచ క్రికెట్ (World Cricket) లో డేవిడ్ వార్నర్ (David Warner) బ్యాటింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.. ఫార్మాట్ తో సంబంధం లేకుండా చెలరేగిపోయే వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ , వన్డేలకు గుడ్ బై చెప్పిన వార్మర్ టీ ట్వంటీ ఫార్మాట్ కూ వీడ్కోలు పలకనున్నాడు. వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ తో అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని వార్నర్ చెప్పాడు. వెస్టిండీస్ తో టీ ట్వంటీ సిరీస్ సందర్భంగా రిటైర్మెంట్ పై ప్రకటన చేశాడు ఈ ఆసీస్ ఓపెనర్…
కెరీర్ లో 100వ టీ ట్వంటీ ఆడిన వార్నర్ ఈ స్పెషల్ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో 70 రన్స్ చేశాడు. తనకు సరికొత్తగా, కొత్త ఉత్సాహంతో ఉన్నట్లుగా అనిపిస్తోందనీ, టీ20 ప్రపంచకప్ మెగాటోర్నీతో కెరీర్ ముగించాలనుకుంటున్నట్టు చెప్పాడు. వచ్చే ఆరు నెలలు ఎంతో కీలకమన్న వార్నర్ కివీస్ తో జరిగే సిరీస్ కీలకంగా చెప్పుకొచ్చాడు. జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యంఇస్తున్నాయి. కాగా, గత నెలలో వార్నర్ తన వన్డే, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వార్నర్ తన కెరీర్‌లో 112 టెస్టులు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వార్నర్ ప్రపంచవ్యాప్తంగా పలు టీ ట్వంటీ లీగ్స్ లో కొనసాగనున్నాడు.