2028 Olympics Cricket : క్రికెట్ క్రీడా అభిమానులకు గుడ్ న్యూస్.. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ క్రీడా..

క్రికెట్ ఈ ఆట గురించి ప్రపంచంలో తెలియని వారు అంటూ ఉండరు.. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంగా క్రికెట్ ఆటను ఆడేవారు. ఇంత వరకు క్రికెట్ ను టీ20, ప్రపంచ వరల్డ్ కప్, ఆసియా వరల్డ్ కప్, వన్డే ప్రపంచకప్‌.. వంటివి మాత్రమే ఆడటం చూసా. ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒలంపిక్ లో ఆడుతున్న క్రికెట్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2023 | 12:27 PMLast Updated on: Oct 14, 2023 | 12:27 PM

Good News For Cricket Fans The Approval Of These Recommendations Was Given In 2028 Olympics In Los Angeles

క్రికెట్ ఈ ఆట గురించి ప్రపంచంలో తెలియని వారు అంటూ ఉండరు.. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంగా క్రికెట్ ఆటను ఆడేవారు. ఇంత వరకు క్రికెట్ ను టీ20, ప్రపంచ వరల్డ్ కప్, ఆసియా వరల్డ్ కప్, వన్డే ప్రపంచకప్‌.. వంటివి మాత్రమే ఆడటం చూసా. ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒలంపిక్ లో ఆడుతున్న క్రికెట్. కానీ ఇది ఇప్పుడు కాదండోయ్.. 2028 సంవత్సరంలో  విశ్వ క్రీడా వేదికపై క్రికెట్ ను అంతర్జాతీయ ఒలింపిక్ లో పోటీ పడనుంది.

క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను తన సొంతం చేసుకున్న క్రీడ క్రికెట్. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 80కి పైగా దేశాలు క్రికెట్ ను ఆడుతున్నారు. దీంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న క్రికెట్ ను అంతర్జాతీయ ఒలింపిక్స్ లో చేర్చడానికి ఒలింపిక్ మండలికి పంపిన సిఫార్సులు లాస్‌ఏంజిల్స్‌ సానుకూలంగా స్పందించింది.

2028లో లాస్‌ ఏంజిల్స్‌  ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడానికి  అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఐఓసీ శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. లాస్‌ఏంజిల్స్‌  ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ చేర్చాలన్న నిర్వాహకుల ప్రతిపాదనకు ఐఓసీ కమిటీ సానుకూలంగా స్పందించి అంగీకారం తెలిపినట్లు ఐవోసీ అధ్యక్షుడు థామస్‌ బాష్‌ ప్రకటించారు.  2028 ఒలింపిక్స్‌లో కొత్తగా మొత్తం ఐదు క్రీడాంశాలు చేరనున్నాయి.. అందులో కూడా క్రికెట్‌ కూడా ఒకటి. ఈ క్రీడాని 2020 ఫార్మెట్ లో ఆరు జట్లు తో పురుషుల, మహిళల విభాగంలో ఒలింపిక్స్ లో చోటు కల్పిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.

చివరి సారిగా 1900 లో విశ్వ క్రీడల్లో ఆడిన క్రికెట్..

దీంతో 1900 ఒలింపిక్స్‌ తర్వాత తొలిసారి విశ్వ క్రీడల్లో క్రికెట్‌ను చూడబోతున్నాం. ఇక అమెరికాలో బాగా పాపులర్‌ గేమ్‌, బేస్‌బాల్‌-సాఫ్ట్‌బాల్‌ను సైతం 2028లో చూడనున్నాం. బేస్‌బాల్‌ను మెన్స్‌, సాఫ్ట్‌బాల్‌ను ఉమెన్స్‌ ఆడగా.. రెండు ఒకే తరహా క్రీడాంశాలు.  స్వ్కాష్‌ను సైతం లాస్‌ ఏంజిల్స్‌ లో  చేర్చటం  భారత క్రీడాకారులకు మేలు చేసేదే అని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయాలను వెల్లడించారు.

123 సంవత్సరాల ఒలింపిక్స్ లో క్రికెట్..

123 సంవత్సరాల క్రితం పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్రీడాంశాలలో భాగంగా తొలిసారిగా క్రికెట్ ను నిర్వహించారు. వివిధ కారణాలతో ఒలింపిక్‌ ప్రధాన క్రీడాంశాలలో క్రికెట్ కు  చోటే కోల్పోయింది. గత శతాబ్ద  కాలంగా ఒలింపిక్స్ అంశాలలో క్రికెట్ ఓ మెడల్ అంశంగా చేర్చడానికి చేసిన ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఏమాత్రం ఫలించలేదు.  ప్రపంచ క్రికెట్ కు మూలస్తంభం లాంటి భారత్ సైతం క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చడానికి సమర్ధించడంతో ఈ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి.

4 దశాబ్దాల తర్వాత ముంబైలో ఐవోపీ 141వ కార్యవర్గ సమావేశం..

క్రికెట్ ను ఒలింపిక్ అంశంగా గుర్తించి.. 2028 ఒలింపిక్స్ లో తిరిగి ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గ్రెగ్ బార్క్ లే హర్షం వ్యక్తం చేశారు. ముంబై వేదికగా ఆదివారం అక్టోబర్ 15న అంతర్జాతీయ ఒలింపిక్ మండలి 141వ కార్యవర్గ సమావేశంలో ఈ విషయం పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో 1983లో న్యూఢిల్లీ వేదికగా (ఐవోపీ) 86వ కార్యవర్గ సమావేశం జరగిన నేటికి నాలుగు దశాబ్దాలు పూర్తి కాగా సూదీర్ఘ విరామం తర్వాత 2023 అక్టోబర్ 14న 141వ ఒలింపిక్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాన్ని అధికారికంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

2028 ఒలింపిక్స్ లో క్రికెట్ తో సహా చేరే మరో నాలుగు క్రీడలు..

  • క్రికెట్
  • ఫ్లాగ్ ఫుట్
  • బాల్ స్క్వాష్
  • లాక్రోసె
  • బేస్ బాల్

2028 నిర్వాహణ కమిటీ సిఫారసుతో ఈ ఐదు క్రీడలను జాబితాలో చేర్చేందుకు ఐఓసీ కమీటి తీర్మానించారు.  అక్టోబర్ 15 నుంచి 17 వరకు ముంబైలో (ఐవోసి) సమావేశ నిర్వహణకు సర్వం సిద్ధమైంది.

S.SURESH