ఆర్సీబీకి గుడ్ న్యూస్ ,స్వింగ్ కింగ్ వస్తున్నాడు

ఐపీఎల్ 18వ సీజన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ను చిత్తుగా ఓడించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 04:15 PMLast Updated on: Mar 26, 2025 | 4:15 PM

Good News For Rcb A Swing King Is Coming

ఐపీఎల్ 18వ సీజన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ను చిత్తుగా ఓడించింది. కీలక బ్యాటర్లు ఫిల్ సాల్ట్ , విరాట్ కోహ్లీ దుమ్మురేపేశారు. అయితే ఆరంభ మ్యాచ్ లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చిన్న గాయం కారణంగా కోల్ కత్తా పై భువి ఆడలేదు. ఇప్పుడు ఆర్సీబీ రెండో మ్యాచ్ కు రెడీ అవుతుండగా ఒక గుడ్ న్యూస్ వచ్చింది. భువనేశ్వర్ చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆడబోతున్నాడు. గాయం కార‌ణంగా దూర‌మైన స్పీడ్ స్టార్ భువ‌నేశ్వ‌ర్ కుమార్.. ఇప్పుడు ఫుల్ ఫిట్‌నెస్ సాధించిన‌ట్లు తెలుస్తోంది. భువీ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టిన‌ట్టు బెంగళూరు ఫ్రాంచైజీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసింది.

భువీ త్వ‌ర‌లోనే బంతిని స్వింగ్ చేస్తాడు… అత‌డు మ‌రింత బ‌లంగా తిరిగిరానున్నాడంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఆర్సీబీ త‌దుపరి మ్యాచ్‌లో భువ‌నేశ్వ‌ర్ ఆడ‌టం దాదాపు ఖాయ‌మైన‌ట్లే. కాగా మొద‌టి మ్యాచ్‌కు భువ‌నేశ్వ‌ర్ కుమార్ స్ధానంలో జ‌మ్మూ కాశ్మీర్ బౌల‌ర్‌రసిఖ్ సలాం చోటు ద‌క్కించుకున్నాడు. కానీ అత‌డు అంత ప్ర‌భావం చూప‌లేదు. మూడు ఓవ‌ర్లు బౌలింగ్ చేసి 35 ప‌రుగుల‌తో పాటు ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. భువీ ఎంట్రీ ఇస్తే ధార్ సలీం బెంచ్‌కు ప‌రిమితం కానున్నాడు.

35 ఏళ్ల భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు అద్భుత‌మైన రికార్డు ఉంది. 176 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ యూపీ ఫాస్ట్ బౌల‌ర్‌.. 7.56 ఎకానమీతో 181 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. కాగా గ‌త కొన్ని సీజ‌న్ల‌గా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన భువనేశ్వర్‌ను ఐపీఎల్‌-2025 వేలంలో రూ. 10.75 భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. కాగా సీఎస్‌కేపై భువనేశ్వర్‌కు అంత‌మంచి రికార్డు లేదు. సీఎస్‌కేపై 20 మ్యాచ్‌ల్లో అత‌డు 39 సగటుతో 20 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఆర్సీబీ త‌మ రెండో మ్యాచ్‌లోమార్చి 28న చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. సీఎస్‌కే కూడా త‌మ మొద‌టి మ్యాచ్‌లో ముంబై పై గెలిచి ఫుల్ జోష్ లో ఉంది. దీంతో ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య పోరు మ‌రోసారి అభిమానుల‌ను ఉర్రూతలూగించడం ఖాయమని చెప్పొచ్చు.