Team India : టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ఇంగ్లాండ్ (England) తో మూడో టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టి జోష్ మీదున్న టీమిండియా (Team India) కు మరో గుడ్‌న్యూస్... గాయంతో జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ (Star Batter) కేఎల్ రాహుల్ (KL Rahul).. నాలుగో టెస్ట్‌లో బరిలోకి దిగనున్నాడు. రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

Good news for Team India fans
ఇంగ్లాండ్ (England) తో మూడో టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టి జోష్ మీదున్న టీమిండియా (Team India) కు మరో గుడ్‌న్యూస్… గాయంతో జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ (Star Batter) కేఎల్ రాహుల్ (KL Rahul).. నాలుగో టెస్ట్‌లో బరిలోకి దిగనున్నాడు. రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ టెస్ట్ అనంతరం కుడి తొడల నొప్పితో జట్టును వీడిన కేఎల్ రాహుల్.. నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు.
రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్‌కు ముందే అతను కోలుకున్నా.. పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని బీసీసీఐ (BCCI) పక్కనపెట్టింది. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడని, రాంచీ టెస్ట్ బరిలోకి దిగుతాడని బోర్డు వర్గాలు తెలిపాయి. రాహుల్ రీఎంట్రీ ఇస్తే రజత్ పటీదార్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు బాది తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.