Hardik Pandya: నేను ఇలాగే ఉంటా.. నేను నాలాగే ఉంటా: హార్ధిక్ పాండ్యా
కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మిగతా రెండు మ్యాచుల్లో జట్టు గెలిచినా.. ఓడినా.. భవిష్యత్తు కోసం తీసుకునే దీర్ఘకాలిక నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పాడు.
Hardik Pandya: ఎట్టకేలకు విండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్ రేసులో నిలిచింది. సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మిగతా రెండు మ్యాచుల్లో జట్టు గెలిచినా.. ఓడినా.. భవిష్యత్తు కోసం తీసుకునే దీర్ఘకాలిక నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పాడు. మేం ఏడుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని అనుకున్నాం. ప్రతి ఒక్క బ్యాటర్ బాధ్యత తీసుకోవాలని ఇంతకుముందు మ్యాచ్ సందర్భంగా నిర్ణయించుకున్నాం.
ఇప్పుడు అమలు చేయగలిగాం. తిలక్ వర్మ నిలకడగా ఆడుతున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్‌లోకి రావడం.. బాధ్యతగా పరుగులు చేయడంతో సహచరులకు ఆదర్శంగా నిలిచాడు. సూర్య, వర్మ కలిసి బాగా ఆడారు.’’ అని పాండ్య తెలిపాడు. ఈ మ్యాచులో ఇండియా గెలిచినప్పటికీ పాండ్యా విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. చివరి బంతికి సిక్సర్ కొట్టి మరీ గెలిపించినప్పటికీ.. దీనివల్ల తిలక్ వర్మ అర్ధ సెంచరీ మిస్ అయ్యిందని, ఈ విషయంలో ధోనిని చూసి నేర్చుకోవాలని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.