అవన్నీ పిచ్చి మాటలు ఇచ్చిపడేసిన గంభీర్
ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్ టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్ళింది. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న భారత్ సెమీస్ లో కంగారూలను చిత్తు చేసి 2023 ఓటమికి రివేంజ్ తీర్చుకుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్ టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్ళింది. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న భారత్ సెమీస్ లో కంగారూలను చిత్తు చేసి 2023 ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. అయితే అయితే, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి నుంచి భారత్‍పై ఓ విమర్శ వస్తోంది. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‍లను దుబాయ్ ఒక్క స్టేడియంలోనే టీమిండియా ఆడుతోందని, దీనివల్ల ఆ జట్టుకు అదనపు ప్రయోజనం చేకూరుతోందని కొందరు విదేశీ మాజీలు విమర్శించారు. ఆసీస్‍తో సెమీఫైనల్ తర్వాత ఆ విమర్శకు భారత హెడ్‍కోచ్ గౌతమ్ గంభీర్ కౌంటర్ ఇచ్చాడు. విమర్శలు చేసిన మాజీ ఆటగాళ్ళకు ఓ రేంజ్ లో ఇచ్చిపడేశాడు. సమాజంలో ఎదిగేందుకు, కొందరు విమర్శించడమే పనిగా పెట్టుకుంటారన్నాడు.
దుబాయ్ పిచ్ వల్ల భారత్ ఎక్కువ అడ్వాంటేజ్ ఏముందని ప్రశ్నించాడు. తాము ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేశామనీ, అక్కడికి, దుబాయ్ స్టేడియానికి పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నాడు. కొంతమంది విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళ్తుంటారు. ఎందుకంటే వారు ఎదగాలి కదా అంటూ సెటర్లు వేశాడు. అయినా ఈ టోర్నమెంట్ లో ఉన్న ఇతర జట్లకు దుబాయ్ వేదిక ఎలా అయితే కొత్తదో, మాకు కూడా అంతేనని స్పష్టం చేశాడు. ఇది మాకు తటస్థ వేదిక మాత్రమేననీ, చివరిసారిగా ఈ స్టేడియంలో తాము ఎప్పుడు ఆడామో కూడా తెలీదన్నాడు. తుది జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండాలనేదే తమ ప్లాన్ గా చెప్పాడు. ఎందుకంటే ఈ టోర్నమెంట్ ఉపఖండం పిచ్ లపై జరుగుతోందని గంభీర్ గుర్తు చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్థాన్‍కు టీమిండియాను పంపబోమని బీసీసీఐ చెప్పేసింది. రాజకీయ కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ ఆడే అన్ని మ్యాచ్‍లను దుబాయ్‍లో ఏర్పాటు చేసింది ఐసీసీ. మిగిలిన మ్యాచ్‍లు పాకిస్థాన్ వేదికగా జరుగుతున్నాయి. ఒకే స్టేడియంలో ఆడడం వల్ల పరిస్థితులు బాగా అలవాటవుతున్నాయని, ఇతర జట్లకు లేని విధంగా భారత్‍కు ప్రయోజనం చేకూరుతోందంటూ ఇంగ్లండ్ మాజీలు నాసీర్ హుస్సేన్, మైక్ అథర్టన్ సహా మరికొందరు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు గట్టిగానే బదులిచ్చాడు గంభీర్… అలాగే తుది జట్టు ఎక్కువమంది స్పిన్నర్లను ఆడించడంపైనా జవాబిచ్చాడు. తాము ప్లాన్ చేయలేదన్నాడు. ఎవరు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా అస్సలు పట్టించుకోనన్నాడు. ఐదుగురు స్పిన్నర్లలో ముగ్గురు ఆల్ రౌండర్లు ఉన్నారన్న విషయం అందరూ మరిచిపోతున్నారని గంభీర్ వ్యాఖ్యానించాడు. స్క్వాడ్ లో కేవలం ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లును మాత్రమే తీసుకున్నామని చెప్పాడు.