Greg Chappell Dravid : శభాష్ ద్రావిడ్… ది వాల్ పై గ్రెగ్ ఛాపెల్ ప్రశంసలు
టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Greg Chappell praises Shabhash Dravid... The Wall
టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా కోచ్ గా ఇంతకంటే గొప్ప విజయంతో ద్రావిడ్ ముగించలేడంటూ పలువురు మాజీ ఆటగాళ్ళు ప్రశంసిస్తున్నారు. అయితే భారత క్రికెటర్లను ఆసీస్ మాజీలు ప్రశంసించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ , టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ ద్రావిడ్ ను అభినందించాడు. ఈ విజయంలో రాహుల్ ద్రవిడ్ భాగమవ్వడం తనకు సంతోషాన్నిచ్చిందన్నాడు.
జట్టుతో తన ప్రయాణాన్ని ద్రవిడ్ అద్భుతంగా ముగించాడని కితాబిచ్చాడు. కొన్నేళ్ల క్రితం తామిద్దరం కలిసి ఇలాంటి విజయాన్ని అందుకోవాలని భావించినా కుదరలేదని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రాహుల్ ద్రవిడ్ తన వరల్డ్ కప్ కల నెరవేర్చుకున్నాడంటూ ఛాపెల్ ప్రశంసించాడు.కాగా విండీస్ వేదికగా జరిగిన 2007 వరల్డ్ కప్ లో ద్రవిడ్ సారథ్యంలోని టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. అప్పుడు గ్రేగ్ ఛాపెల్ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ ఓటమితోనే అతని వివాదాస్పద కోచింగ్ కెరీర్ కు తెరపడింది.