Gujarat Titans: గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. యాక్సిడెంట్‌లో గాయపడ్డ యువ వికెట్ కీపర్
తన కవాసకి సూపర్ బైక్‌పై ఒంటరిగా వెళ్తున్న రాబిన్ మింజ్.. అదుపు తప్పి ఎదురుగా వచ్చిన మరో బైకర్‌ను ఢీ కొట్టినట్లు అతని తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ తెలిపాడు. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని చెప్పాడు.

Gujarat Titans: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ వికెట్ కీపర్, జార్ఖండ్ ప్లేయర్ రాబిన్ మింజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని పరిస్థితి విషమంగా లేనప్పటికీ గాయాలైనట్లు తెలుస్తోంది. తన కవాసకి సూపర్ బైక్‌పై ఒంటరిగా వెళ్తున్న రాబిన్ మింజ్.. అదుపు తప్పి ఎదురుగా వచ్చిన మరో బైకర్‌ను ఢీ కొట్టినట్లు అతని తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ తెలిపాడు.
Pat Cummins: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్.. మార్క్‌రమ్ స్థానంలో కమ్మిన్స్‌కు సారథ్య బాధ్యతలు
ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని చెప్పాడు. రోడ్డుపై పడిపోవడంతో రాబిన్ మింజ్ కుడి మోకాలు కొట్టుకుపోయిందని, బైక్ ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నదని ఫ్రాన్సిస్ మింజ్ తెలిపాడు. అతను ఐపీఎల్ ప్రీ సీజన్ క్యాంప్‌లో చేరాల్సి ఉంది. కానీ ప్రస్తుత ప్రమాదం అతని చేరికను ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో రాబిన్ మింజ్‌ను గుజరాత్ టైటాన్స్ 3.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
రాబిన్ మింజ్ పెద్దగా దేశవాళీ క్రికెట్ ఆడకపోయినా.. 14 టీ20 మ్యాచ్‌ల్లో 148.9 స్ట్రైక్‌రేట్‌తో 353 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడగలిగే సామర్థ్యం ఉండటంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.