IPL 2023: గుజరాత్ గాలంలో పంజాబ్ బలం
ఐ పి ఎల్ 2023 లో తనదైన దూకుడును కొనసాగిస్తున్న జట్లలో పంజాబ్ ఒకటి. లాస్ట్ మ్యాచులో సన్ రైజర్స్ చేతిలో ఓడినప్పటికీ, పంజాబ్ కింగ్స్ పోటీ తత్వంలో ఎలాంటి మార్పు లేదు. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఆటతీరును పవర్ ప్లేలో కావాల్సినన్ని పరుగులు పిండుకుంటుంది పంజాబ్.
శిఖర్ ధావన్ లాంటి సీనియర్ ఆటగాడు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పంజాబ్ జట్టు, నేడు గుజరాత్ టైటాన్స్ వంటి స్ట్రాంగ్ జట్టుతో ఆడబోతుంది. పంజాబ్ బలాబలాల్ని చూస్తే, వారి ప్రధాన బలం ఓపెనింగ్ పెయిరే అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఆడిన మ్యాచులను గమనిస్తే, జట్టు సాధించిన దాంట్లో 60 శాతం పరుగులు వీరివి ఉంటాయి. జితేష్ శర్మ, భానుక రాజపక్సలు అనుకున్న మేరకు రాణించకపోవడంతో, శిఖర్ ధావన్ పై మొత్తం భారం పడుతూ ఉంది.
సిఖందర్ రజా, షారుఖ్ ఖాన్ లు ఇంకా పూర్తి స్థాయిలో ఖాతాలో తెరవలేదు. సామ్ కరన్, మాట్ షాట్ లు కూడా అంతంత మాత్రంగానే జట్టులో కొనసాగుతున్నారు. బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ లు మాత్రమే ప్రత్యర్థిని కట్టడి చేయగలుగుతున్నారు. సౌత్ ఆఫ్రికా బౌలర్ కగిసో రబడా రాక కోసం పంజాబ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాహుల్ చాహర్ కూడా ఇంకా వికెట్ల వేటలో పూర్తిగా భాగస్వామ్యం కాలేకపోతున్నాడు. పంజాబ్ లో కీలకంగా ఓపెనర్లతో పాటు, నాథన్ ఎల్లిస్ మాత్రమే కనబడుతున్నారు. వీరి కోసం సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే, గుజరాత్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది.
ఇంపాక్ట్ ప్లేయర్ ను సరిగ్గా వాడుకుంటే, లోకల్ బ్యాట్స్ మెన్ లకు అవకాశం ఇవ్వడం మంచింది. గెలుపు శాతం గుజరాత్ వైపే ఎక్కువ ఉండడంతో, ధావనాట్టు ప్రణాళికలు ఎలా ఉంటాయో అని ఐ పి ఎల్ ఫ్యాన్స్ ఈవినింగ్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.