Kayden Sharma : గల్లీ భాయ్.. గల్లీ నుంచి ముంబై వరకు.. టాలెండ్ ను ఆపేదెవడ్రా

కేడన్ శర్మ.. సోషల్ మీడియాలో ఇతనో సంచలనం.. ర్యాపర్‌గా ఇతని విజయం ఓ ప్రభంజనం.. హైద‌రాబాద్‌కీ షాన్‌గా మారిన ఈ 23 ఏళ్ల కుర్రాడు చరిత్ర సృష్టిస్తున్నాడు. స్ట్రీట్‌ సెలబ్రిటీ సాంగ్‌తో.. సెలబ్రిటీలనే ఫిదా చేస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2023 | 02:13 PMLast Updated on: Dec 28, 2023 | 2:13 PM

Gully Boy From Gully To Mumbai Apedevadra Talent

కేడన్ శర్మ.. సోషల్ మీడియాలో ఇతనో సంచలనం.. ర్యాపర్‌గా ఇతని విజయం ఓ ప్రభంజనం.. హైద‌రాబాద్‌కీ షాన్‌గా మారిన ఈ 23 ఏళ్ల కుర్రాడు చరిత్ర సృష్టిస్తున్నాడు. స్ట్రీట్‌ సెలబ్రిటీ సాంగ్‌తో.. సెలబ్రిటీలనే ఫిదా చేస్తున్నాడు. MTV స్టేజ్ పై హ‌ల్చల్ చేసిన ఈ హైద‌రాబాదీ కుర్రాడి సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే.. లెట్స్ వాచ్ దిస్‌ స్టోరీ.

ఈ ఏడాది సోషల్ మీడియాలో మార్మోగిపోయిన తెలుగు తేజాల్లో హైదరాబాదీ ర్యాపర్ కేడన్ శర్మ మొదటి ప్లేస్‌లో ఉంటాడు. ప్రముఖ అంతర్జాతీయ మ్యూజిక్ సంస్థ ఎంటీవీ హస్టిల్ సీజన్‌లో ఉన్నట్టుండి మెరిసిన కేడన్ శర్మ.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాడు. సోషల్ మీడియాను షేక్ చేశాడు.. ఆ షోలో ఈ ర్యాప‌ర్ హైద‌రాబాద్ డెవ‌ల‌ప్ మెంట్ గురించి పాడిన పాట ఓ పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. కేడన్ శర్మ గాత్రంలో నుంచి జాలువారిన స్ట్రీట్ సెలబ్రిటీ సాంగ్ ఒక ఊపు ఊపేసింది. దీంతో.. అతని క్రియేటివిటీని చూసి వివిధ రంగాలకు చెందిన సినీ, పొలిటికల్ స్టార్లు కేడన్ శర్మను ఆకాశానికి ఎత్తేశారు.. ప్రశంస‌ల‌తో ముంచెత్తారు.

స్ర్టీట్‌ సెలబ్రిటీ సాంగ్‌తో అస‌లు సిసలైన హైద‌రాబాద్ అంటే ఎలా ఉంటుందో వినిపించాడు ర్యాప్ స్టార్ కేడ‌న్ శ‌ర్మ.. ఈ హ్యాపెనింగ్ సిటీకి అత‌నో స్పెష‌ల్ వాయిస్‌గా నిలిచాడు. తనే లిరిక్ రైటర్ గా పాటను రాసుకుని కేడెన్ శర్మ పాడిన ఈ సాంగ్ అంతా హైదరాబాద్ గొప్పతనం గురించి ఉంటుంది. హైదరాబాద్ కల్చర్, సిగ్నిఫికెన్స్, సినిమాలు, ఫుడ్ దేశవ్యాప్తంగా ఎలా స్టాండ్ అవుట్ అవుతున్నాయో చాలా కాన్ఫిడెంట్ గా ర్యాప్ చేసి వినిపించాడు కేడెన్.. ఎంటీవీ మ్యూజిక్ షోలో కేడ‌న్ పాడిన పాట.. ఇంట‌ర్నెట్‌లో సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. ఇక ఆ పాట‌కు సెలబ్రిటీల నుంచి సామన్యుల వరకూ ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. లోకల్ ఫ్లేవ‌ర్‌తో కూడిన విష‌యాల‌ను.. కేడన్ శర్మ హిప్ హాప్ స్టైల్‌లో పాడిన తీరు అంద‌ర్నీ స్టన్ చేసింది. అప్పట్లో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ కూడా కేడన్ టాలెంట్‌కు ముగ్ధుడయ్యారు. కేడన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

రెండు మూడురోజుల్లోనే వైరల్ గా మారిన కేడెన్ శర్మ ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించాడు. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న రౌడీ హీరో విజయ్‌ కూడా మనోడి టాలెంట్‌కి ఫిదా అయిపోయాడు. హీరోయిన్ సమంత కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్‌లో కేడన్‌ శర్మతో కలిసి డ్యాన్స్ చేసింది. అటు.. సినిమాలకు సంబంధించిన విషయాలపై కూడా తన స్పెషల్ సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్నాడీ హైదరాబాదీ గయ్.. పుష్పలో అల్లు అర్జున్ నేషనల్ వైడ్ ఎంత సెన్సేషన్ అయ్యాడో.. అలాగే హీరోయిన్ సాయిప‌ల్లవి సింప్లిసిటీ, త‌ను న‌టించిన మారీ2 మూవీలో రౌడీ బేబీ సాంగ్, బాలీవుడ్ సినిమాల నిర్మాణానికి అడ్డాగా నిలుస్తున్న రామోజీ ఫిలింసిటీ, ఇక వ‌ర‌ల్డ్ వైడ్ పాపులారిటీ సాధించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ, నాటు నాటు ఆస్కార్ విన్నింగ్ గురించి.. త‌న ర్యాప్ ద్వారా పాడుతూ MTV స్టేజ్ పై దుమ్మురేపాడు కేడెన్ శ‌ర్మ.. కేడెన్ శర్మ చూపించిన టాలెంట్ కు ఇంప్రెస్ అయిన జడ్జ్ బాద్షా సహా మిగిలిన టీమ్ లీడర్స్ కేడెన్ శర్మను కంటెండర్ సెలెక్ట్ చేస్తున్నట్లు యునానిమస్ గా ప్రకటించారు. ధూల్ పేట్ కు చెందిన కేడెన్ శర్మ 2019 లో తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశాడు. తనే రాసుకుని పాడిన ర్యాప్ సాంగ్స్ ను అప్లోడ్ చేయటం మొదలుపెట్టాడు. 23ఏళ్ల వయస్సులో ఇప్పుడు MTV రియాల్టీ షో లో పాడిన పాట ద్వారా కేడెన్ శర్మ కష్టానికి బ్రేక్ వచ్చింది. దీంతో.. ఆకాశమే హద్దుగా రెచ్చిపోతూ తనకే సాధ్యమైన టాలెంట్‌తో దూసుకుపోతున్నాడు కేడన్ శర్మ