17 బంతుల్లో హాఫ్ సెంచరీ మిల్లర్ నాటుకొట్టుడు

క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ లో సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 2, 2024 | 04:02 PMLast Updated on: Oct 02, 2024 | 4:02 PM

Half Century From 17 Balls By Miller

క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ లో సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. బార్బడోస్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న మిల్లర్ ఎలిమినేటర్ మ్యాచ్ లో నైట్ రైడర్స్ పై మెరుపులు మెరిపించాడు. ఫ్లడ్‌ లైట్స్‌ అంత‌రాయం క‌లిగించిన ఈ మ్యాచ్‌లో నైట్ రైడ‌ర్స్ 19.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 168 ప‌రుగులు చేసింది. డక్ వర్త్ రూల్స్ ప్రకారం రాయ‌ల్స్ టార్గెట్‌ను 5 ఓవ‌ర్ల‌లో 60 ప‌రుగుల‌గా నిర్ణ‌యించారు. ఛేజింగ్ లో డికాక్ మూడో బంతికే ఔటైనా…డేవిడ్ మిల్ల‌ర్ మాత్రం ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 17 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. మిల్లర్ దూకుడుతో బార్బడోస్ రాయల్స్ 4.2 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని చేధించింది.