Hanuma Vihari: ఆంధ్ర ఆటల్లో రాజకీయాలు.. హనుమ విహారి సంచలన నిర్ణయం..
టీమిండియా టెస్టు ప్లేయర్, ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎప్పుడూ కూడా ఆంధ్రా జట్టు తరపున ఆడనని చెప్పాడు. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తాను.. ఎందుకు రాజీనామా చేశాడనే విషయాలను సోషల్ మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు.
Hanuma Vihari: రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓడిపోయింది. చివరి వరకు పోరాడిన టీమ్.. నాలుగు పరుగుల తక్కువ తేడాతో ఓడిపోయింది. ఓటమితో రంజీ ట్రోఫీ నుంచి ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది. ఆంధ్రా ఓటమికి మించి.. ఇప్పుడో ఘటన తీవ్ర చర్చకు కారణం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆటలకు ఇచ్చే ప్రాధాన్యత.. ఇక్కడి రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయన్న దానిపై.. ఓ బ్యాడ్‌నేమ్ ఉంది.
IND VS ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నెగ్గిన భారత్.. 3-1తో సిరీస్ కైవసం..
ఇప్పుడు అదే నిజం అయ్యేలా ఓ ఘటన జరిగింది. టీమిండియా టెస్టు ప్లేయర్, ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎప్పుడూ కూడా ఆంధ్రా జట్టు తరపున ఆడనని చెప్పాడు. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తాను.. ఎందుకు రాజీనామా చేశాడనే విషయాలను సోషల్ మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు. ఓ రాజకీయ నాయకుడి కుమారుడిపై అరిచినందుకు.. తను కెప్టెన్సీ వదలుకోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రంజీలో బెంగాల్‌తో ఆంధ్రాకు మొదటి గేమ్ జరగగా.. దానికి హనుమ విహారి కెప్టెన్‌గా ఉన్నాడు. ఐతే ఆ మ్యాచ్ తర్వాత 17వ ఆటగాడు కెఎన్ పృధ్వీరాజ్ మీద హనుమ విహారి అరిచాడు. దీంతో పృద్వీరాజ్ వెళ్లి.. తన తండ్రికి చెప్పాడు. ఐతే రాజకీయ పలుకుబడి ఉన్న పృధ్వీరాజ్ తండ్రి.. హనుమను కెప్టెన్సీ నుంచి తొలగించాలని అసోసియేషన్ మీద ఒత్తిడి తెచ్చాడు. దీంతో హనుమను పక్కనపెట్టేశారు.
ఇదీ సంగతి అంటూ.. హనుమ విహారి అంతా రాసుకొచ్చాడు. ఆత్మగౌరవాన్ని కోల్పోయానని.. ఆంధ్రా తరఫున ఎప్పటికీ ఆడొద్దని డిసైడ్ అయినట్లు విహారి చెప్పాడు. నిజానికి 17వ ఆటగాడి పేరును.. తన పోస్ట్‌లో హనుమ విహారి చెప్పలేదు. దీని మీద పృధ్వీరాజ్ రియాక్ట్ అయ్యాడు. హనుమ చెప్పేదంతా అబద్ధమని కొట్టిపారేశాడు. ఆ రోజు ఏం జరిగిందో టీమ్‌లోని అందరికీ తెలుసుని.. మీకు కావాలంటే ఈ సానుభూతి గేమ్‌లను ఆడండి అంటూ రాసుకొచ్చాడు. ఈ ఘటన ఇప్పుడు రచ్చ రేపుతోంది.