Harbhajan Singh: అనుష్క, అథియాపై భజ్జీ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్స్
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో.. కోహ్లీ వైఫ్ అనుష్క, కెఎల్ రాహుల్ వైఫ్ అతియా.. మాట్లాకుంటూ కెమెరా కంటికి చిక్కారు. అయితే వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండటాన్ని మెయిన్ స్క్రీన్ పై చూసిన భజ్జీ.. వాళ్లకు క్రికెట్ నాలెడ్జ్ ఉండకపోవచ్చని కామెంట్ చేశారు.

Harbhajan Singh: ఒక్కొక్కప్పుడు సరదాగా అన్న మాటలు.. సీరియస్‌గా పేలుతాయి. మనకే తలనొప్పులు తీసుకువస్తాయి. పది మందితో మాటలు పడేలా కూడా చేస్తుంటాయి. ఇక ఎట్ ప్రజెంట్.. స్టార్ క్రికెటర్ భజ్జీ మాటలు కూడా ఆయనకు అలాంటి తలనొప్పులే తీసుకొచ్చాయి. ఔను.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ బ్యాక్ ఎండ్‌లో.. హిందీ కామెంటేటర్‌గా పని చేస్తున్న స్పిన్నర్ హర్బజన్ సింగ్.. ఆ పని చేస్తూనే సరదాగా ఓ కామెంట్ చేశారు.
Sanju Samson: సంజూకి మళ్ళీ మొండిచేయి.. బీసీసీఐపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్..!
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో.. కోహ్లీ వైఫ్ అనుష్క, కెఎల్ రాహుల్ వైఫ్ అతియా.. మాట్లాకుంటూ కెమెరా కంటికి చిక్కారు. అయితే వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండటాన్ని మెయిన్ స్క్రీన్ పై చూసిన భజ్జీ.. వాళ్లకు క్రికెట్ నాలెడ్జ్ ఉండకపోవచ్చని.. బహుశా వాళ్లు సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారేమో.. అని ఓ కామెంట్ విసిరారు. అంతే అదే కామెంట్ ఇప్పుడు భజ్జీని తీవ్ర విమర్శల పాలు చేస్తోంది.
వాళ్ల ప్రొఫెషన్‌ను మధ్యలోకి లాగుతూ.. భజ్జీ ఇలా కామెంట్ చేయడం బాగోలేదనే టాక్ అటు బాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది. దానికి తోడు.. ఆడాళ్లు అంటే అంత చులకనా.. వాళ్లకు క్రికెట్ నాలెడ్జ్ ఎందుకు ఉండకూడదు..? అనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది. ఈ పిచ్చి కూతలే.. భజ్జీ తీరును అందరూ తప్పుబట్టేలా చేస్తున్నాయి.