ఆర్చర్ పై జాత్యహంకార వ్యాఖ్యలు. వివాదంలో హర్భజన్ సింగ్…!
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఉన్న భజ్జీ తన నోటి దురుసుతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆర్చర్ పై భజ్జీ చేసిన కామెంట్సే ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం...

భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఉన్న భజ్జీ తన నోటి దురుసుతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆర్చర్ పై భజ్జీ చేసిన కామెంట్సే ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం… ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్‌లో మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇషాన్ కిషాన్, హెన్రిచ్ క్లాసెన్ వరుస బౌండరీలు బాది ఆర్చర్ బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు రాబట్టారు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన జోఫ్రా ఆర్చర్ ఒక నో బాల్, రెండు వైడ్లతో కలిపి 76 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరెస్ట్ బౌలింగ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
జోఫ్రా అర్చర్ బౌలింగ్ ను ఉద్దేశిస్తూ హర్భజన్ సింగ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ సమయంలో ఆర్చర్‌ను కాలీ ట్యాక్సీతో పోల్చాడు. లండన్‌లో బ్లాక్ కలర్ ట్యాక్సీల మీటర్లలాగా.. ఆర్చర్ మీటర్ కూడా ఈ రోజు పెరిగిపోతోందంటూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశాడు. భజ్జీ చేసిన ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆర్చర్ రంగును పరోక్షంగా ఉద్దేశిస్తూ.. ఆ నల్ల ట్యాక్సీలతో పోల్చడంపై వివాదం రాజుకుంది. ఇది విన్న క్రికెట్ అభిమానులు.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తున్నారు. కామెంట్రీ ప్యానెల్ నుంచి హర్భజన్‌ను సస్పెండ్ చేయాలని అంటున్నారు. హర్భజన్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అతడిపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరు భజ్జీ అత్యంత అహంకారంతో కూడిన వ్యాఖ్యలు చేశాడని కామెంట్లు చేస్తున్నారు. వెంటనే అతడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
భజ్జీ గతంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ని మంకీ’ అని పిలిచాడంటూ ఆరోపణలు రావడం, అప్పుడు చాలా పెద్ద వివాదంగా మారి ప్రపంచ క్రికెట్ ను కుదిపేసింది తాను మంకీ అనలేదని, మా…కీ అని హిందీలో తిట్టానని భజ్జీ చెప్పడం, ఆ మాటలు తాను విన్నానంటూ సచిన్ టెండూల్కర్ సపోర్ట్ ఇవ్వడంతో ఆ కేసు నుంచి బయటపడ్డాడు ఇప్పుడు మరోసారి హర్భజన్ సింగ్, ఇలాంటి రేసిజం వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా హర్భజన్ సింగ్ ఈ వ్యాఖ్యలు హిందీలో చేయడం వల్ల ఇప్పటిదాకా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కానీ, ఇంగ్లీష్ క్రికెటర్లు కానీ దీనిపై స్పందించలేదు. వాళ్ల దాకా వెళితే, ఈ వివాదంపై మరింత రచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.