అగస్త్యతో హార్థిక్ కొడుకుతో గడుపుతున్న ఆల్ రౌండర్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాతో రిలాక్స్ అవుతున్నాడు. గత కొన్ని నెలలుగా ఆటలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పాండ్యా ప్రస్తుతం కొడుకు అగస్త్యతో వెకేషన్ లో గడుపుతున్నాడు. ఇటీవలే హార్థిక్ తో విడిపోయిన నటాషా తమ కొడుకును ముంబైలో వదిలేసి వెళ్ళినట్టు తెలుస్తోంది.
కృనాల్ పాండ్యా భార్య పంఖురి శర్మ చేసిన పోస్టుతో ఈ విషయం బయటకు వచ్చింది.
ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. అందులో.. తన కొడుకు కవిర్ తో కలిసి అగస్త్యకు కథలు చెబుతున్నాను అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
విడాకులు ప్రకటించిన సమయంలోనే అగస్త్య బాధ్యతలు ఇద్దరం తీసుకుంటామని చెప్పిన ఈ జోడీ ప్రస్తుతం అదే ఫాలో అవుతోంది. కొన్ని రోజుల క్రితం అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియా వెళ్ళిపోయింది. ఇప్పుడు తండ్రి దగ్గరకు తీసుకొచ్చి వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. కొడుకు రాకతో హార్థిక్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియాకు షెడ్యూల్ ఏదీ లేకపోవడంతో మరికొన్ని వారాల పాటు కొడుకుతోనే గడిపే ఛాన్సుంది. కరోనా సమయంలో ప్రేమించి పెళ్ళిచేసుకున్న హార్థిక్, నటాషా ఇటీవలే విడిపోయారు. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.