IPL 2023: ‘పాములకు విశ్వాసముంటుందా? అంతా మా తప్పే’! ‘బుద్ధి బయటపెట్టుకున్నావ్‌’

ఐపీఎల్ అభిమానుల భావోద్వేగాలకు అద్దు.. అదుపు ఉండదు. తమ ఫేవరెట్ జట్లని తక్కువ చేసి మాట్లాడితే అసలు ఊరుకోలేరు. మనకు నచ్చింది వాగడానికి, ట్రోలింగ్ చేయడానికి ఎలాగో సోషల్ మీడియా ఉందిగా! తాజాగా హార్ధిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్‌ అభిమానులు చేస్తున్న పోస్టులు, ట్వీట్లు చూస్తే ఈ విషయం క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది..ఇంతకీ పాండ్యా ఏం చేశాడు..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 7, 2023 | 06:54 PMLast Updated on: May 07, 2023 | 6:54 PM

Hardik Pandya Indirectly Trolled Mumbai While Praising Chennai Fans Fire On Ex Mumbai Indians Player

అది 2014 ఐపీఎల్ వేలం.. అప్పటివరకు ఎప్పుడూ వినని ఆటగాడి పేరు ఆక్షన్‌లోకి వచ్చింది.. ఎవరూ కొనుగోలు చేయలేదు..! 2015లో మరోసారి అదే పేరు వేలంలో వినిపించింది. అప్పటికీ కేవలం చిన్నస్థాయి క్రికెట్‌లో 16 టీ20లే ఆడాడు అతను..స్ట్రైక్ రేట్‌ కూడా 112మాత్రమే..చేసిన పరుగులు కూడా 342మాత్రమే..! సాధారణంగా ఇలాంటి గణాంకాలున్న ఆటగాడు వేలంలో అన్‌సోల్డ్ అవుతాడు. కానీ ముంబై ఇండియన్స్ అతనిలో తమ జట్టు భవిష్యత్తును చూసుకుంది. 10లక్షల బేస్‌ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది..! కట్ చేస్తే అతను టీమిండియాకు భవిష్యత్తులో కాబోయే కెప్టెన్‌.. ప్రపంచం మెచ్చిన ఆల్‌రౌండర్‌..అతనే గుజరాతీ బిడ్డ హార్ధిక్‌ పాండ్యా.

ముంబై ఫ్రాంచైజీ, రోహిత్‌ శర్మ అండ లేకపోతే నేను లేనే లేను అన్నీ హార్దిక్‌ పాండ్యా చెప్పుకున్న సందర్భాలు ఎన్నో.. తన జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన 2015లోనే జరిగిందని.. ముంబై ఇండియన్స్ ఆనాడు తనను కొనుగోలు చేసి ఉండకపోతే ఇప్పుడు నేనీ పొజిషన్‌లో ఉండేవాడని కాదని పాండ్యా చాలా సార్లు చెప్పుకున్నాడు. అయితే అదంతా గతం.. ప్రస్తుతం పాండ్యా అవకాశం వచ్చినప్పుడల్లా ముంబై ఇండియన్స్‌కు చురకలంటిస్తున్నాడని ఆ జట్టు అభిమానులు ఫైర్ అవుతున్నారు.. తాజాగా రాబిన్‌ ఉతప్పకు హార్ధిక్ పాండ్యా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండ్యా చేసిన వ్యాఖ్యలు రోహిత్ శర్మ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఇంతకీ పాండ్యా ఏమన్నాడు?

టీమిండియాకు ట్రంప్‌ కార్డ్‌ టీమ్‌:
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు బాగా ఆడితే టీమిండియాలో ప్లేస్‌ పక్కా అన్నది ఫ్యాన్స్‌ లెక్క. హార్ధిక్‌ పాండ్యా, బుమ్రా, ఇషాన్ కిషన్, రాహుల్ చహర్ అలా భారత్‌ జట్టులోకి వచ్చినవాళ్లే. అద్భుత టాలెంట్‌ ఉన్నా..దాదాపు 10ఏళ్లు పాటు టీమిండియాలో ప్లేస్‌ కోసం ఎదురుచూసిన మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్ యాదవ్‌ కూడా ముంబై ఇండియన్స్‌లో అద్భుతంగా ఆడే భారత్‌ జట్టులో ప్లేస్‌ కొట్టేశాడు. వీళ్లందరిలో ఫ్యాన్స్‌ ఎక్కువగా చెప్పుకునేది పాండ్యా, బుమ్రా గురించి.. ఎందుకంటే వారిద్దరూ టీమిండియా మ్యాచ్‌ విన్నర్లు..! వాళ్లు జట్టులో ఉంటే కెప్టెన్‌కు కొండంత అండ..! తొలిసారి 10, 20 లక్షల రూపాయలకు వీరిద్దరిని ముంబై కొనుగోలు చేసింది. తర్వాత వారికి కోట్లలోనే ఫీజు చెల్లించింది. రిటైన్ చేసుకున్న తర్వాత 2018 నుంచి 2021 మధ్యకాలంలో పాండ్యాకు ఏటా రూ.11 కోట్లు చెల్లించింది.

ఆక్షన్‌లో వెళ్దామనుకున్న పాండ్యా?
2022 ముందు హార్దిక్‌ పాండ్యా భారీ ధర ఆశించాడని.. అయితే కెప్టెన్ రోహిత్‌తో పాటు.. బుమ్రాను మొదట రెండు రిటైన్‌ ఆప్షన్స్‌గా ముంబై ఫ్రాంచైజీ డిసైడ్ చేయడంతో పాండ్యా నీతా అంబానీ జట్టుకు గుడ్‌బై చెప్పాడని ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. పాండ్యా భారీ ధర ఆశించింది నిజమే.. ఎందుకంటే అతను వేలానికి వెళ్తే 15కోట్లు పెట్టి కొనుగోలు చేసే ఫ్రాంచైజీలు ఉన్నాయి.. కానీ అప్పటికే ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ తీసుకొచ్చిన రోహిత్.. బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ను ముందుండి నడిపిస్తున్న బుమ్రా కంటే పాండ్యాకు ఎక్కువ ఫీజు చెల్లించడం ముంబైకి కుదరలేదు. ఐపీఎల్ రూల్స్‌ ప్రకారం.. రిటైన్‌ చేసుకున్న నలుగురు ఆటగాళ్లుకు నిబంధనల ప్రకారమే చెల్లించాలి. ఇక ఆ తర్వాత పాండ్యాను గుజరాత్‌ జట్టు కొనుగోలు చేయడమే కాకుండా.. అతడికి కెప్టెన్సీ అప్పగించింది. కెప్టెన్సీ చేసిన తొలి సీజన్‌లోనే గుజరాత్‌ టీమ్‌ను ఐపీఎల్ విజేతగా నిలిపాడు పాండ్యా.

నిజానికి పాండ్యా తొలి సారే కెప్టెన్‌గా విజయవంతం కావడంపట్ల అందరికంటే ఎక్కువగా ముంబై ఫ్యాన్సే సంతోషించారు. అదే సమయంలో ముంబై వరుస పరాజయాలు పాలవడం.. రోహిత్ జట్టులో పాండ్యా లేని లోటును కూడా కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇక ఆ తర్వాత పాండ్యా చేస్తున్న వ్యాఖ్యల పలుసార్లు రోహిత్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేశాయి. రోహిత్ కెప్టెన్సీని తక్కువ చేసే విధంగా కొన్ని సార్లు పాండ్యా మాట్లాడడన్నది ఫ్యాన్స్‌ వాదన. అయితే తాజాగా రాబిన్‌ ఉతప్పకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండ్యా వ్యాఖ్యలు నిజంగానే ముంబై ఫ్రాంచైజీని తక్కువ చేసేలాగే ఉన్నాయి.

ఇంతకీ పాండ్యా ఏమన్నాడు:
బెస్ట్ ప్లేయర్లను కొనే ముంబై ఇండియన్స్ కంటే ప్లేయర్ల నుంచి బెస్ట్ రాబట్టే చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే తనకు ఇష్టమంటూ రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించే వ్యాఖ్యలు చేశాడు పాండ్యా. అయితే ఇది పాండ్యా వ్యక్తిగత అభిప్రాయమని కొట్టిపారేయడానికి లేదంటున్నారు రోహిత్‌ ఫ్యాన్స్‌. ఎందుకుంటే హార్ధిక్‌ పాండ్యా సహా జట్టులోని కీలక ఆటగాళ్లు ముంబై ఫ్రాంచైజీ నుంచే టీమిండియాలోకి వచ్చారు.. వాళ్లంతా ఒకప్పుడు సాధారణ ప్లేయర్లు. ముంబై ఇండియన్స్‌కి ఆడిన తర్వాతే టీమిండియాలోకి వచ్చి స్టార్ స్టేటస్‌లు తెచ్చుకున్నారు. టీమిండియాకు చెన్నై సూపర్ కింగ్స్‌ అందించిన ఆటగాళ్లను తక్కువ చేయలేమన్నది నిజమే.. కానీ రైనా.. జడేజా..అశ్విన్‌ చెన్నై జట్టుకు ఆడకుముందు నుంచే రంజీల్లో రాణించిన వారు.. అండర్‌-19 వరల్డ్‌ కప్‌ల్లో ఆడిన వాళ్లు.. కానీ పాండ్యా.. బుమ్రాలకు అలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేనేలేదు. పాండ్యా ముంబై టీమ్‌లోకి వచ్చిన తర్వాత తన అన్న కృనాల్‌ పాండ్యాని కూడా తీసుకొచ్చాడు. ఇలా ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేని పాండ్యా ఇప్పుడు తనకు లైప్‌ ఇచ్చిన ముంబై కేవలం స్టార్లనే కొంటుందని చెప్పడం రోహిత్ ఫ్యాన్స్‌ కోపానికి కారణమైంది.