Rohit Sharma: అంతా నార్మల్ అయినట్టేనా.. రోహిత్‌ను కౌగిలించుకున్న హార్దిక్
కెప్టెన్‌గా ముంబైను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. ఈ ఏడాది సీజన్‌లో సాధరణ ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు.రోహిత్ శర్మ స్ధానంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టు కెప్టెన్‌గా ముంబై ఫ్రాంచైజీ నియమిచింది.

Rohit Sharma: ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో వాంఖడేలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో ముంబై జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే కెప్టెన్‌గా ముంబైను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. ఈ ఏడాది సీజన్‌లో సాధరణ ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు.
BRS Krishank: రేవంత్ సోదరుడిపై ఆరోపణలు.. BRS సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌పై కేసు !
రోహిత్ శర్మ స్ధానంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టు కెప్టెన్‌గా ముంబై ఫ్రాంచైజీ నియమిచింది. ముంబై తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐదు సార్లు టైటిల్స్‌ను అందించిన హిట్‌మ్యాన్ ముంబై ఫ్రాంచైజీ వ్యవహరించిన తీరును చాలా మంది మాజీలు సైతం తప్పుబట్టారు. అంతేకాకుండా ముంబై నిర్ణయం పట్ల రోహిత్ శర్మ కూడా ఆసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వీటిన్నటికి హిట్‌మ్యాన్, హార్దిక్ ఇద్దరూ చెక్ పెట్టారు.
ప్రాక్టీస్ సెషన్‌లో ఇద్దరూఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
View this post on Instagram