ఓడినా వణికించాడుగా హార్థిక్ పాండ్యాపై ప్రశంసలు

ఐపీఎల్ 18వ సీజన్ లోనూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. బ్యాట్ తో అదరగొడుతున్నా గెలుపు ముంగిట బోల్తా పడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2025 | 05:50 PMLast Updated on: Apr 08, 2025 | 5:50 PM

Hardik Pandya Praised For Showing Courage Despite Defeat

ఐపీఎల్ 18వ సీజన్ లోనూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. బ్యాట్ తో అదరగొడుతున్నా గెలుపు ముంగిట బోల్తా పడుతోంది. తాజాగా సొంతగ్రౌండ్ వాంఖేడే స్టేడియంలోనూ ఇదే జరిగింది. దాదాపు మ్యాచ్ పై ఆశలు లేని స్థితి నుంచి గెలుపు వైపు వెళ్ళిన ముంబై చివరి నిమషంలో ఒత్తిడికి లోనై పరాజయం పాలైంది. కానీ ఈ మ్యాచ్ లో పాండ్యా బ్యాటింగ్ ను ఎవ్వరైనా సరే మెచ్చకోవాల్సిందే. ఎందుకంటే 221 పరుగుల భారీస్కోర్ చేసినా కూడా విజయం ఆర్సీబీకి అంత ఈజీగా దక్కలేదు.దీనికి కారణం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ దశలో ఆర్సీబీని వణికించాడు. దీంతో అప్పటివరకు ఎంతో ఉత్సాహంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా హార్దిక్ బ్యాటింగ్ తో కాసేపు భయపడిపోయారు.

222 రన్స్ టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో మొదట ముంబై 12 ఓవర్లలో కేవలం 99 పరుగులే చేసింది. అప్పుడు 6వ స్థానంలో వచ్చిన పాండ్యా బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. జోష్ హెజిల్‌వుడ్ వేసిన 14 ఓవర్లలో ఏకంగా 22 పరుగులు సాధించాడు. అందులో రెండు సిక్సలు, ఓ ఫోర్ ఉన్నాయి. ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్నే 6, 4, 6గా మల్చాడు. అనంతరం సోదరుడు కృనాల్ పాండ్య వేసిన తర్వాతి ఓవర్ లోనూ రెండు సిక్సలు బాదాడు. దీంతో ఆ ఓవర్ లో ముంబయి ఇండియన్స్ 19 పరుగులు చేసింది. ఈ రెండు ఓవర్లే మ్యాచును కాస్త మలుపు తిప్పేలా చేసి.. ఆర్సీబీ ఫ్యాన్స్ ను భయపెట్టేలా చేసింది. మొత్తంగా 8 బంతుల్లో 33 పరుగుల చేసిన హార్దిక్ పాండ్య.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా చేసేలా కనిపించాడు. కానీ చివరికి 15 బంతుల్లో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అలా హార్దిక్ తన ప్రదర్శనతో ఆర్సీబీని, ఆ జట్టు అభిమానులను కాసేపు ఫుల్ గా టెన్షన్ పెట్టాడు. అందరూ ఎక్కడ ఓడిపోతామేమోనని తెగ భయపడిపోయారు. ఇక ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ ఆర్సీబీవైపు తిరిగింది. హార్దిక్ ఔట్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరిగా ఆర్సీబీ 12 పరుగులు తేడాతో గెలిచింది.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో తన ప్రదర్శనతో హార్థిక్ అరుదైవ రికార్డు అందుకున్నాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన త‌రువాత పాండ్యా ఓ అరుదైన ఘ‌న‌తను సాధించాడు. టీ20ల్లో 5000 ప‌రుగులు, 200 వికెట్లు ప‌డ‌గొట్టిన తొలి భార‌త ఆట‌గాడిగా హార్దిక్ పాండ్యా చ‌రిత్ర సృష్టించాడు. ఓవ‌రాల్‌గా 12వ ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. డ్వేన్ బ్రావో, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, మహ్మద్ నబీ, సమిత్ పటేల్, కీరాన్ పొలార్డ్, రవి బొపారా, డేనియల్ క్రిస్టియన్, మోయిన్ అలీ, షేన్ వాట్సన్, మహ్మద్ హఫీజ్ లు పాండ్యా క‌న్నా ముందుగానే ఈ ఘ‌న‌త సాధించారు.