Hardik Pandya: నీకంటే గల్లీ బౌలర్ బెటర్ కదా.. హార్థిక్ బౌలింగ్‌పై ఫ్యాన్స్ ఫైర్
ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన పాండ్యా.. 20.50 పైగా ఏకానమితో ఏకంగా 41 పరుగులిచ్చాడు. హార్దిక్ ప్రతీ మ్యాచ్‌లోనూ ఈ తరహా ప్రదర్శన చేస్తున్నాడు. 9 మ్యాచ్‌లలో 227 పరుగులు సమర్పించుకున్న పాండ్యా కేవలం 4 వికెట్లే తీయగలిగాడు.
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో హార్దిక్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తన చెత్త బౌలింగ్‌తో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన పాండ్యా.. 20.50 పైగా ఏకానమితో ఏకంగా 41 పరుగులిచ్చాడు. హార్దిక్ ప్రతీ మ్యాచ్‌లోనూ ఈ తరహా ప్రదర్శన చేస్తున్నాడు.
YSRCP MANIFESTO: కొత్త పథకాలేవి..? వైసీపీ మేనిఫెస్టోలో సంచనాలు ఏవి..?
9 మ్యాచ్‌లలో 227 పరుగులు సమర్పించుకున్న పాండ్యా కేవలం 4 వికెట్లే తీయగలిగాడు. ఎకానమీ చూస్తే ఓవర్‌కు 12 ఉంది. కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్, కెప్టెన్సీ పరంగా తీవ్ర నిరాశ పరుస్తున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ స్థాయికి తగినట్టు రాణించడం లేదు. ఒకప్పటి మెరుపులు పాండ్యా బ్యాటింగ్‌లో అస్సలు లేవు. 9 మ్యాచ్‌లలో 197 పరుగులే చేయగా.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ క్రమంలో హార్దిక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. నీకంటే గల్లీ బౌలర్ బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నాడు. కెప్టెన్‌గానూ అతని నిర్ణయాలను తప్పుపడుతున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్‌పై తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాండ్యాపై ముంబై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బౌలింగ్ మార్పుల విషయంలోనూ హార్థిక్ అంత ఎఫెక్ట్ చూపించడం లేదు.
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో అసలు హార్థిక్‌కు చోటు ఇవ్వడం దండగనేంటూ తేల్చేస్తున్నారు. యువ ఆటగాళ్లు చాలా మంది సత్తా చాటుతున్న వేళ ఆల్‌రౌండర్‌గా ఒక్క మ్యాచ్‌లోనూ పాండ్యా ప్రభావం చూపించకపోవడంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సీజన్ ఆరంభానికి ముందు ట్రేడింగ్ ద్వారా పాండ్యాను గుజరాత్ నుంచి ముంబై కొనుగోలు చేసింది. రోహిత్ స్థానంలో జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే సారథిగా జట్టును సక్సెస్‌ఫుల్ బాటలో అతను నడిపించలేకపోతుండడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.