HARDIK PANDYA: అతని తప్పిదాలే ఓటమికి కారణం.. హార్దిక్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ల విమర్శలు
హార్దిక్ పేలవమైన బ్యాటింగ్, చెత్త కెప్టెన్సీ చేశాడని పఠాన్ బ్రదర్స్.. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ విమర్శించారు. బుమ్రాకు ఆలస్యంగా బంతిని అందించి హార్దిక్ ఘోర తప్పిదం చేశాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

HARDIK PANDYA: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ముంబై ఇండియన్స్‌పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీనే ఓటమికి కారణం అంటూ మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్ పేలవమైన బ్యాటింగ్, చెత్త కెప్టెన్సీ చేశాడని పఠాన్ బ్రదర్స్.. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ విమర్శించారు. బుమ్రాకు ఆలస్యంగా బంతిని అందించి హార్దిక్ ఘోర తప్పిదం చేశాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
SRH VS MI: ఉప్పల్‌లో రికార్డుల సునామీ.. ఒక్క మ్యాచులో ఎన్ని రికార్డులో..
హైదరాబాద్ 3 ఓవర్లకు 40/0 స్కోరుతో ఉన్నప్పుడు బుమ్రా తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. తర్వాత బుమ్రా 13వ ఓవర్‌లో మరోసారి బంతి అందుకున్నాడు. అప్పటికే సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధించింది. అటు ముంబైకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎస్‌ఆర్‌హెచ్ మాజీ కోచ్ టామ్ మూడీ కూడా హార్దిక్ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేశాడు. బుమ్రా ఎక్కడ..? మ్యాచ్ దాదాపు ముగిసిపోయింది. ముంబై బెస్ట్ బౌలర్ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు అంటూ టామ్ మూడీ SRH బ్యాటింగ్ సమయంలో ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే బ్యాటింగ్‌లోనూ హార్దిక్ నిరాశపరిచాడు. 20 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ముంబై బ్యాటర్లలో అత్యంత తక్కువ స్ట్రైక్‌రేటు హార్దిక్‌దే. జట్టు మొత్తం 200 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే.. కెప్టెన్ మాత్రం 120 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేశాడు అంటూ సెటైర్లు వేశారు.