Hardik Pandya: 83లో కపిల్.. 23లో హార్దిక్.. వరల్డ్ కప్ మనదే..!
కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ వరల్డ్ కప్‌లో జట్టుకు హార్దిక్ పాండ్య మెయిన్ ప్లేయర్ అని చెప్పేసాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్ మీద జరిగిన లీగ్ మ్యాచ్‌లో 87 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Hardik Pandya: వరల్డ్ కప్‌కి 15 మందితో కూడిన భారత జట్టుని మంగళవారం ప్రకటించేశారు. ఆసియా కప్‌కి సెలక్ట్ చేసిన 17 మందిలో తిలక్ వర్మ, ప్రసిద్ క్రిష్ణని తొలగించి మిగిలిన ప్లేయర్లను వరల్డ్ కప్‌నకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా నిన్న సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటుగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ వరల్డ్ కప్‌లో జట్టుకు హార్దిక్ పాండ్య మెయిన్ ప్లేయర్ అని చెప్పేసాడు.
ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్ మీద జరిగిన లీగ్ మ్యాచ్‌లో 87 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 60 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన దశలో హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ మరువలేనిది. హార్దిక్ ఇన్నింగ్స్ కెప్టెన్ రోహిత్ శర్మని బాగా ఇంప్రెస్ చేసింది. ఈ ఆల్ రౌండర్‌పై ప్రశంసలు కురిపిస్తూ “వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఫామ్ మాకు చాలా కీలకం. జట్టులో బౌలింగ్, బ్యాటింగ్ చేసే ప్లేయర్లు ఉండడం బాగా కలిసి వస్తుంది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో వీరు ప్రధాన పాత్ర పోషిస్తారు” అని రోహిత్ తెలియజేశాడు.