Hardik Pandya: టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమ్.. పాండ్యాకు చోటు లేనట్టేనా ?
వరల్డ్‌కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గత వారం సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు స్థానం ఇవ్వాలా..? వద్దా విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Hardik Pandya: టీ 20 వరల్డ్ కప్‌కు ఇక కొద్ది రోజులే టైం ఉంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే వరల్డ్ కప్ కోసం టీమిండియా బయలుదేరనుంది. అయితే ఈ నెలాఖరుకల్లా భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టీమ్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడం డౌట్‌గానే కనిపిస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పాండ్యా కెప్టెన్‌గాను, ఆటగాడిగానూ ఆకట్టుకోలేకపోతున్నాడు.
Glenn Maxwell: బెంగళూరుకు షాక్.. సీజన్ నుంచి తప్పుకున్న మాక్స్‌వెల్
ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 131 పరుగులు చేసిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. కేవలం 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గత వారం సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు స్థానం ఇవ్వాలా..? వద్దా విషయంపై దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నాడా లేడా అన్న అంశం మీద కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్ దృష్ట్యా పాండ్యా ఎంపికపై ఇప్పుడే మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
మరికొన్నాళ్లు వేచి చూసిన తర్వాతే అతడిని మెగా టోర్నీకి సెలక్ట్ చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో పాండ్యా రెగ్యులర్‌గా బౌలింగ్ చేస్తేనే అతడికి చోటిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అందులో గనుక పాండ్యా విఫలమైతే అతడికి ప్రత్యామ్నాయంగా సీఎస్‌కే స్టార్ శివం దూబే వైపు సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది.