Brook: దుమ్ము దులుపుతున్న బ్రూక్.. సన్ రైజర్స్ పంట పండినట్లే..!!
న్యూజిలాండ్ తో (Newzealand) జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో బ్రూక్ మాములుగా ఆడట్లేదు. అతడు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్ లో మొత్తం నాలుగు సెంచురీలు, మూడు అర్థ సెంచురీలు ఉన్నాయి.
ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రుక్ ను (Harry Brook) ఎవరు సెలెక్ట్ చేసారో కానీ, సన్ రైజర్స్ (SRH) జట్టుకు మాత్రం గొప్ప సాయం చేసారు. న్యూజిలాండ్ తో (Newzealand) జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో బ్రూక్ మాములుగా ఆడట్లేదు. అతడు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్ లో మొత్తం నాలుగు సెంచురీలు, మూడు అర్థ సెంచురీలు ఉన్నాయి. మొదటి తొమ్మిది ఇన్నింగ్స్లో ఎనిమిది వందల పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ తాను ఎదుర్కొన్న 803 బంతుల్లో, ఏకంగా 800 పరుగులు సాధించాడు. జరుగుతుంది టెస్టు మ్యాచా? లేక టీ 20 మ్యాచా అనేంతగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు ఈ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్.
IPL 2023 కి సంబంధించి, ఈ సంచలన ఆటగాడు దుమ్ముదులపడం కన్ఫామ్ అనే అనిపిస్తుంది. రెండు లేదా మూడు వికెట్లు పడ్డాక బరిలోకి దిగే ఈ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్, హైదరాబాద్ జట్టును ఛాంపియన్ గా నిలుపగలడు అనే ఊహాగానాలు ఇప్పటికే మొదలైపోయాయి. ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) నాయకత్వంలో, అత్యంత పటిష్టంగా ఉంది సన్ రైజర్స్ జట్టు. ఓపెనింగ్ పెయిర్ ఒక్కటే కాస్త అనుమానపడేలా ఉన్నా, మిగతా జట్టంతా ఛాంపియన్ మోడల్ లో కనిపిస్తుంది. హ్యారీ బ్రుక్స్ ను, అభిషేక్ శర్మతో (Abhishek Sharma) ఓపెనింగ్ కు దించి SRH మంచి ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేస్తే బావుంటుంది. రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi) గ్లేన్ ఫిలిప్స్ (Glen Philips) వంటి హార్డ్ హిట్టర్స్ మధ్యలో హ్యారీ బ్రుక్ మరో పిల్లర్ లా ఆరంజ్ ఆర్మీకి సేవలు అందించబోతున్నాడు.