Harthik Love Story : హార్థిక్ కొత్త లవ్ స్టోరీ.. ఆ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడా ?
గత కొన్ని నెలలుగా టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఏదో ఒక రీజన్ తో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.
గత కొన్ని నెలలుగా టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఏదో ఒక రీజన్ తో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా రావడం దగ్గర నుంచి వరల్డ్ కప్ లో అదరగొట్టి జట్టు విజయాల్లో కీరోల్ ప్లే చేసే వరకూ పడిలేచిన కెరటంలా వచ్చాడు. ఇదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొని భార్య నటాషాతో విడిపోయాడు. ఇటీవలే టీ ట్వంటీ కెప్టెన్సీ చేజార్చుకున్న హార్థిక్ ఇప్పుడు కొత్త లవ్ స్టోరీ మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేతో హార్థిక్ పాండ్యా రిలేషన్ లో ఉన్నట్టు రూమార్స్ చక్కర్లు కొడుతున్నాయి.
వీరిద్దరు కలిసి అంబానీ పెళ్లిలో సందడి చేశారు. హిందీ పాటలకు పాండ్యా, అనన్య కలిసి స్టెప్పులు వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నుంచీ సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకర్ని ఒకరు ఫాలో అవుతుండడంతో రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు అనన్య పాండే, హార్ధిక్ పాండ్యా పెట్టే కాప్షన్లు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్ మొదలైనట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిలో నిజమెంతో తెలియదు కానీ.. ఈ క్రేజీ గాసిప్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. అనన్య పాండే గతంలో ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్, ఆదిత్యరాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. రీసెంట్‌గానే ఆదిత్యరాయ్ కపూర్‌కు బ్రేకప్ చెప్పింది.