Hardik Pandya : నటాషాకు హార్థిక్ అదిరిపోయే షాక్‌..

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌ హార్థిక్ పాండ్యా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని నేషనల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 26, 2024 | 04:25 PMLast Updated on: May 26, 2024 | 4:25 PM

Harthiks Shock To Natasha

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌ హార్థిక్ పాండ్యా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని నేషనల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు హార్ధిక్ నుంచి కానీ.. ఇటు నటాషా నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో.. విడాకుల వార్త మరింత స్ట్రాంగ్‌గా స్ప్రెడ్ అవుతోంది. సెర్బియా నటి కమ్‌ మోడల్ అయిన న‌టాషా… పాండ్యా అనే పేరును తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించింది. దీంతో వారిద్దరు విడిపోయారనే ప్రచారం ఊపందుకుంది. ఐతే భరణం కింద నటాషాకు.. తన ఆస్తుల్లో 70శాతం హార్ధిక్‌ ఇవ్వాల్సి ఉంటుందనే కొత్త గాసిప్ వైరల్ అయింది. దీంతో ఇప్పుడు హార్ధిక్ ఆస్తుల వ్యవహారం కొత్త చర్చకు కారణం అవుతోంది.

గతంలో హార్ధిక్ మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్న నెటిజన్లు.. నటాషాకు భారీ షాక్ తగిలింది అంటూ.. కామెంట్లు పెడుతున్నారు. తన డబ్బు ఇత‌ర‌ ఆస్తులన్నీ తన తల్లి నియంత్రణలో ఉన్నాయని… బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే షోలో హర్ధిక పాండ్యా గతంలో చెప్పుకొచ్చాడు. ఆర్థిక వ్యవ‌హారాల్లో తన మీద తనకే నమ్మకం లేదని.. అందుకే తల్లి పేరు మీదకు బదిలీ చేసినట్లు వెల్లడించాడు. కారు బంగ్లా స‌హా ఖ‌రీదైన ఆస్తుల‌న్నీ… తన అమ్మ పేరుతోనే ఉన్నాయని హార్దిక్ చెప్పాడు. తన పేరు మీద ఏమీ తీసుకోనని భవిష్యత్తులో ఎవరికీ 50శాతం ఇవ్వకూడదని కూడా చెప్పాడు. అయితే ఇది 2018నాటి వీడియో క్లిప్. ప్రస్తుతం విడాకుల వార్తలు వినిపిస్తున్న వేళ.. ఆ వీడియోను మళ్లీ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. అతడి దూరాలోచ‌న‌ను విజనరీ అంటూ ప్రశంసిస్తున్నా.. ఒక నెటిజ‌న్ అయితే సెటైరికల్‌గా రియాక్ట్ అయాడు. బాగా ఆడాడు కదా అంటూ రాసుకొచ్చాడు. ఐతే విడాకుల మీద ఇద్దరి నుంచి క్లారిటీ రాకపోయినా.. విడిపోయిన మాట నిజం అని మరికొందరు బలంగా చెప్తున్నారు. హార్దిక్, నటాషా ఇద్దరూ.. ఒకరితో ఒకరు ఫోటోలు పోస్ట్ చేయడం లేదని… 2024 IPL మ్యాచ్‌కు కూడా న‌టాషా హాజరు కాలేదని ప్రూఫ్స్ చూపిస్తున్నారు మరికొందరు. మార్చి 4న బ‌ర్త్ డే సంద‌ర్భంగా హార్థిక్ త‌న భార్యకు విషెస్ చెప్పలేద‌ని మరికొందరు గుర్తు చేస్తున్నారు.