Hyderabad Ranji Team: బీఎండబ్ల్యూ కారు, కోటి రూపాయలు.. హైదరాబాద్ రంజీ జట్టుకు బంపరాఫర్
ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ తిలక్‌వర్మ, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డికి తలో రూ.50 వేలు నగదు బహుమతిని అందించనున్నారు.

Hyderabad Ranji Team: రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు హెచ్‌సీఏ భారీ నజరానా ప్రకటించింది. జట్టుకు రూ.10 లక్షలు, వ్యక్తిగతంగా అదరగొట్టిన ప్లేయర్స్‌కు రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్పారు.
Prabhas: వదలని లీకులు.. రాజా సాబ్ నుంచి డైలాగ్ లీక్..!
ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ తిలక్‌వర్మ, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డికి తలో రూ.50 వేలు నగదు బహుమతిని అందించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ముగిసిన రంజీ ట్రోఫీ ప్లేట్ ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయను ఓడించింది. అనంతరం జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జగన్ మోహన్ రావు ఆటగాళ్లకు బంపరాఫర్ ఇచ్చారు.
వచ్చే 2-3 ఏళ్లలో రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే జట్టుకు రూ. కోటి, జట్టులోని ప్రతి ఆటగాడికి బీఎండబ్ల్యూ కారు ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్ జట్టు ప్లేట్ నుంచి ఎలైట్ గ్రూప్ చేరుకోవడంతో ఒక లక్ష్యం పూర్తయిందన్నారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. దీనికి హెచ్‌సీఏ తరఫున జట్టుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.