హెల్మెట్ తీసి మరీ క్యాచ్ పట్టాడు. వైరల్ గా మారిన డికాక్ క్యాచ్…
ఐపీఎల్ 18వ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు.

ఐపీఎల్ 18వ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను డికాక్ పెవిలియన్‌కు పంపాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పరాగ్ మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని చాలా ఎత్తుగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ల వెనక ఉన్న డికాక్ తన కీపింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. బంతి గాల్లోకి లేచిన వెంటనే డికాక్ క్యాచ్ కాల్ ఇచ్చాడు. క్లియర్ వ్యూ కోసం హెల్మెట్‌ను తీసి మరి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అతడి వద్దకు వచ్చి అభినంధించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
https://www.instagram.com/reel/DHqrZNiBBdP/?utm_source=ig_web_copy_link