Suryakumar Yadav : ఇది కదా కెప్టెన్సీ అంటే… సూర్యాభాయ్ నువ్వు తోపు..
ఎటువంటి పరిస్థితుల్లోనైనా జట్టును సమర్థవంతంగా లీడ్ చేయడమే నాయకుడి లక్షణం... మంచి జట్టు ఉంటేనే విజయాలు అందించడం కాదు..
ఎటువంటి పరిస్థితుల్లోనైనా జట్టును సమర్థవంతంగా లీడ్ చేయడమే నాయకుడి లక్షణం… మంచి జట్టు ఉంటేనే విజయాలు అందించడం కాదు.. క్లిష్ట పరిస్థితుల్లోనూ గొప్ప కెప్టెన్సీతో జట్టును లీడ్ చేయడం.. ఓటిపోయే మ్యాచ్ లో జట్టును గెలిపిస్తే ఆ కిక్కే వేరు.. నిజంగానే ఇలాంటి కిక్కును భారత క్రికెట్ ఫ్యాన్స్ కు సూర్యకుమార్ యాదవ్ అందించాడు. లంకతో చివరి టీ ట్వంటీలో విజయం కోసం చేయాల్సినవి 6 పరుగులే.. బౌలర్లు ఉన్నారు… కానీ పిచ్ పరిస్థితిని అంచనా వేసిన సూర్యకుమార్ వ్యూహాత్మకంగా తానే బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు.
IPL 2025, Chennai Super Kings : ఆటగాడిగా మళ్ళీ చూస్తామా ? బీసీసీఐ చేతిలో ధోనీ ఫ్యూచర్
నిజానికి సూర్యకుమార్ రెగ్యులర్ బౌలర్ ఏమీ కాదు.. అంతెందుకు టీ ట్వంటీల్లో ఇప్పటి వరకూ భారత తరపున ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. అయినప్పటకీ లంక బ్యాటర్ల బలహీనతను గమనించి, పిచ్ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి తన స్లో బౌలింగ్ తో ప్రత్యర్థిని బోల్తా కొట్టించాడు. 20వ ఓవర్ లో బౌలింగ్ చేయాలన్నది అతను తీసుకున్న నిర్ణయమే.. అలాగే 19వ ఓవర్ ను రింకూ సింగ్ తో వేయించాలన్న వ్యూహం కూడా అతనిదే.
Olympics Medal, Manu Bakar : ఒకే ఒలింపిక్స్ లో రెండు.. పతకాల వేటలో మను సరికొత్త చరిత్ర
ఈ రెండు వ్యూహాల్లోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. 20వ ఓవర్ లో 5 పరుగులే ఇచ్చి2 వికెట్లు తీసిన సూర్యకుమార్ తర్వాత సూపర్ ఓవర్ లో ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. దీంతో సూర్యకుమార్ కెప్టెన్సీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాను కెప్టెన్ ను కాదు లీడర్ గా ఉండాలనుకుంటున్నానని గతంలోనే చెప్పిన సూర్యాభాయ్ ఇప్పుడు దానిని అక్షరాలా పాటిస్తున్నాడు. మొత్తం మీద పూర్తిస్థాయి టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ తొలి సిరీస్ లో 100 కి 100 మార్కులు కొట్టేశాడు.