హిట్ మ్యాన్ ధనాధన్ దిగ్గజాల రికార్డులు గల్లంతు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. దాదాపు ఏడాది కాలంగా ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న భారత సారథి ఇటీవల ఇంగ్లాండ్ తో సిరీస్ ద్వారా ఫామ్ లోకి వచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2025 | 05:15 PMLast Updated on: Feb 21, 2025 | 5:15 PM

Hit Man Dhanadhan Giants Records Are Missing

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. దాదాపు ఏడాది కాలంగా ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న భారత సారథి ఇటీవల ఇంగ్లాండ్ తో సిరీస్ ద్వారా ఫామ్ లోకి వచ్చాడు. రెండో వన్డేలో సెంచరీతో దుమ్మురేపిన రోహిత్ తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో మెరుపులు మెరిపించాడు. బంగ్లాదేశ్ పై ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయి అందుకున్న రెండో బ్యాటర్‌గా హిట్ మ్యాన్ నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసిన రోహిత్ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే 13 పరుగుల వ్యవక్తిగత స్కోర్ వద్ద 11 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు.

261 వన్డే ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను రోహిత్ అధిగమించాడు. మాస్టర్ బ్లాస్టర్ 276 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. అతను 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, జాక్వస్ కల్లీస్ టాప్-6లో కొనసాగుతున్నారు. వన్డేల్లో భారత్ తరఫున 11 వేల పరుగుల క్లబ్‌లో చేరిన ఐదో బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. తద్వారా శ్రీలంక పేరిట ఉన్న అరుదైన రికార్డ్‌ను టీమిండియా అధిగమించింది. వన్డేల్లో 11వేల పరుగులు చేసిన అత్యధిక బ్యాటర్లు కలిగిన దేశంగా భారత్‌ నిలిచింది. ఈ రికార్డ్ శ్రీలంక పేరిట ఉండగా.. భారత్ అధిగమించింది. శ్రీలంక తరఫున కుమార సంగక్కర, మహేళ జయవర్దనే, సనత్ జయసూర్య ఈ ఫీట్ సాధించారు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీతో పాటు రోహిత్ శర్మ 11 వేల క్లబ్‌లో చేరడంతో భారత్‌కు ఈ ఘనత దక్కింది.

భారత్ తరఫున అత్యధిక ఐసీసీ టోర్నీలు ఆడిన ఆటగాడిగానూ రోహిత్ శర్మ నిలిచాడు. హిట్ మ్యాన్‌కు ఇది 15వ ఐసీసీ టోర్నీ. ఈ క్రమంలో అతను యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను అధిగమించాడు. రోహిత్ శర్మకు ఇది మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఇప్పటి వరకు హిట్ మ్యాన్ మూడు వన్డే ప్రపంచకప్‌లు ఆడాడు. 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడాడు. కాగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో రోహిత్ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి రెండు ఓవర్లలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్‌.. మూడో ఓవర్‌ నుంచి బౌండరీల మోత మొదలు పెట్టాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి రోహిత్‌ శర్మ ఔటయ్యాడు.