Kohli, Rohit Sharma : విరాట్ బాటలోనే హిట్ మ్యాన్.. టీ ట్వంటీలకు రోహిత్ గుడ్ బై
అంతర్జాతయ టీ20 క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించాడు.కోహ్లీ బాటలోనే వరల్డ్ టైటిల్ గెలిచి ఘనంగా పొట్టి ఫార్మెట్‌కు వీడ్కోలు పలికాడు.
అంతర్జాతయ టీ20 క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించాడు.కోహ్లీ బాటలోనే వరల్డ్ టైటిల్ గెలిచి ఘనంగా పొట్టి ఫార్మెట్‌కు వీడ్కోలు పలికాడు. వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత హిట్ మ్యాన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా తరఫున తన చివరి టీ20 మ్యాచ్ అని రోహిత్ శర్మ చెప్పాడు. ఈ ఫార్మెట్‌కు వీడ్కోలు చెప్పేందుకు ఇంతకుమించిన మంచి సమయం లేదన్నాడు. టీ20 కెరీర్‌లోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశానన్న హిట్ మ్యాన్ వరల్డ్ కప్ గెలవాలని అనుకున్నాననీ, గెలిచానని చెప్పుకొచ్చాడు.
టీమిండియా తరఫున టీ ట్వంటీ క్రికెట్‌లో 159 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 4231 పరుగులు చేశాడు. దీనిలో ఐదు సెంచరీలు , 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.తద్వారా పొట్టి క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఈ ఫార్మాట్‌తోనే టీమిండియా తరపున రోహిత్ అంతర్జాతీయ కెరీర్ మొదలైంది. 2007 టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి వరల్డ్ కప్ ట్రోఫితో గ్రాండ్ గా వీడ్కోలు పలికాడు. కాగా రోహిత్ వన్డే , టెస్ట్ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ కొనసాగనున్నాడు.