Hardik Pandya, Natasha : నాదే తప్పని ఎలా అంటారు ? విడాకుల వార్తలపై నటాషా
టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా విడాకుల వార్తలు గత కొన్నిరోజులుగా షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ విడిపోవడం ఖాయమనే అంచనా కూడా వచ్చేసింది.

How do you say it's my fault? Natasha on the divorce news
టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా విడాకుల వార్తలు గత కొన్నిరోజులుగా షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ విడిపోవడం ఖాయమనే అంచనా కూడా వచ్చేసింది. ఈ వార్తలపై అటు హార్థిక్ కాని, ఇటు నటాషా కాని ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే ఇద్దరి మధ్య జరుగుతున్న పరిణామాలతో విడిపోయినట్టు అర్థమవుతోంది. తాజాగా నటాషా ఈ విడాకుల వార్తలపై పరోక్షంగా స్పందించింది. తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన గురించి నెగిటివ్‌గా మాట్లాడుతున్న వారికి కౌంటర్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత హార్ధిక్ పాండ్యాకు మద్దతు పెరగడంతో కొంత మంది నటాషాదే తప్పు అయి ఉంటుందంటూ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్‌కు దిగుతున్నారు.
అలాంటి వారికి ఆమె తన వీడియోతో గట్టిగానే సమాధానమిచ్చింది. జనాలు ఏమీ తెలియకుండా, తెలుసుకోకుండా ఒకరిని జడ్జ్ చేసేస్తూ ఉంటారని వ్యాఖ్యానించింది. అసలు ఒక సంఘటన వెనుక ఏం జరిగి ఉంటుందో వాళ్లకు తెలియదవీ. కానీ, డైరెక్ట్‌గా జడ్జ్ చేస్తూ.. అపార్థం చేసుకుంటూ ఉంటారని చెప్పింది. ఒక వ్యక్తి గురించి ఏదైన రూమర్ రాగానే నిజమో కాదో తెలుసుకోకుండా, కనీసం సానుభూతి చూపించకుండా జడ్జ్ చేసేస్తారని వీడియోలో చెప్పుకొచ్చింది. హార్ధిక్‌కి తనకి మధ్య జరిగిన విషయం గురించి ఏం తెలియని వారు కూడా తనదే తప్పు అని జడ్జ్ చేస్తున్నారనే విషయంపై ఆమె ఈ విధంగా స్పందించి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.