IPL PRIZE MONEY : ఐపీఎల్ లో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే ?
ఐపీఎల్ ఫైనల్ లో తన సత్తా చూపించి కోల్ కతా నైట్ రైడర్స్ కప్పును ఎగరేసుకుపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశల్ని వమ్ము చేసింది. ఫైనల్లో ఆ జట్టును ఓడించింది.

How much is the prize money for the winner in IPL?
ఐపీఎల్ ఫైనల్ లో తన సత్తా చూపించి కోల్ కతా నైట్ రైడర్స్ కప్పును ఎగరేసుకుపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశల్ని వమ్ము చేసింది. ఫైనల్లో ఆ జట్టును ఓడించింది. క్యాష్ రిచ్ లీగ్ గా పిలిచే ఐపీఎల్ లో విజేత అయిన కేకేఆర్ కు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది… రన్నరప్ గా నిలిచిన SRH కు ఎంత అమౌంట్ ఇచ్చారన్నది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ సిరీస్ మొత్తానికి రూ.46.5 కోట్లను బీసీసీఐ ప్రైజ్ మనీగా అందించింది. ఇందులో ఐపీఎల్ విజేత అయిన కేకేఆర్ కు 20 కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ దక్కింది. రన్నరప్ గా నిలిచిన SRH కు 13 కోట్ల క్యాష్ రివార్డును BCCI అందించింది. ఇంకా మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 7 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న RCB క ఆరున్నర కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది.
ఇంకా 741 పరుగులు చేసిన ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కోహ్లీకి 10 లక్షల రూపాయలు, 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్న ప్లేయర్ హర్షల్ పటేల్ కి 10 లక్షల క్యాష్ రివార్డ్ దక్కింది. ఎమర్జింగ్ టోర్నీ అవార్డు అందుకున్న ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి 10 లక్షలు, 488 పరుగులు 17 వికెట్లు తీసి మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచిన నిలిచిన సునీల్ నరైన్ కి 10 లక్షల రూపాయల చొప్పున క్యాష్ రివార్డు దక్కింది.