Women’s Premier League : ఆర్సీబీకి వచ్చిన ప్రైజ్ మనీ ఎంతంటే ?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ (Women's Premier League) విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఛాంపియన్స్‌గా నిలిచిన ఆ జట్టుకు భారీగానేఫ్రైజ్‌ మనీ దక్కింది. ఆర్సీబీకి 6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్ కు 3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2024 | 02:00 PMLast Updated on: Mar 18, 2024 | 2:00 PM

How Much Is The Prize Money Received By Rcb

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ (Women’s Premier League) విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఛాంపియన్స్‌గా నిలిచిన ఆ జట్టుకు భారీగానేఫ్రైజ్‌ మనీ దక్కింది. ఆర్సీబీకి 6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్ కు 3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఇక ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ ఎల్లీస్‌ పెర్రీ ఆరెంజ్ క్యాప్‌ హోల్డర్‌గా నిలిచింది. ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్‌ మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 347 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆర్సీబీ స్పిన్నర్‌ శ్రేయంక పాటిల్‌ పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌గా నిలిచింది. 9 మ్యాచ్‌లు ఆడిన శ్రేయంక. 13 వికెట్లు పడగొట్టింది.దీంతో ఆమెకు 5 లక్షల ఫ్రైజ్‌ మనీ లభించింది. ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డు కూడా శ్రేయాంక కే దక్కింది. మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ గా దీప్తి శర్మ ఎంపికయింది. ఇక ఫెయిర్‌ ప్లే టీమ్‌ అవార్డును రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దక్కించుకుంది.