IND VS ENG: చివరి టెస్టుకు ఎక్స్‌ట్రా పేసర్.. టీమ్ కాంబినేషన్‌పై రోహిత్ కామెంట్స్
పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పాడు. తుది జట్టు ఎంపిక ఇంకా ఖరారు కాలేదని, మ్యాచ్ ప్రారంభానికి ముందు చివరగా పిచ్ ఔట్ లుక్ చూసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.
IND VS ENG: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 3-1తో గెలుచుకున్న టీమిండియా.. ధర్మశాల వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న ఆఖరి పోరుకు సిద్దమైంది. ఇప్పటికే సీరీస్ గెలిచినా.. చివరి మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో చివరి టెస్ట్ కోసం టీమిండియా కాంబినేషన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పాడు. తుది జట్టు ఎంపిక ఇంకా ఖరారు కాలేదని, మ్యాచ్ ప్రారంభానికి ముందు చివరగా పిచ్ ఔట్ లుక్ చూసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.
Nita Ambani: నీతా.. ది క్వీన్.. ఆరు లుక్స్‌లో అదరగొట్టిన నీతా అంబానీ
ధర్మశాల పిచ్ పేస్‌కు అనుకూలమా..? ర్యాంక్ టర్నరా? అనే చర్చ అనవసరమన్న రోహిత్.. పిచ్ ఎలా ఉన్నా మ్యాచ్ గెలవడమే తమ ప్రధాన లక్ష్యం అని చెప్పాడు. ర్యాంక్ టర్నర్ పిచ్ సిద్దం చేసినా.. ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉంటాయన్నాడు. ధర్మశాలలో తాను ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేదనీ, జట్టులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లు, పేసర్లకు మాత్రం ఇక్కడ ఆడిన అనుభవం ఉందన్నాడు. పిచ్ మాత్రం చూడటానికి మంచి వికెట్‌లానే కనబడుతోందన్న హిట్ మ్యాన్ భారత్ తరహా పిచ్‌లానే ఆరంభంలో స్వింగ్ అయ్యి.. తర్వాత స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉందని అంచనా వేశాడు. ఈ టెస్టు ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరగనుంది. ఇక ఇక్కడి పిచ్ బ్యాటర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో మంచి బౌన్స్, క్యారీతో ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుంది. ఈ వేదికపై జరిగిన ఏకైక టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది.
దీంతో స్పిన్నర్ల కంటే కూడా ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలంగా ఉంటుందని అంచనా. ఈ కారణంగానే భారత్ అదనపు పేసర్‌తో ఆడనుంది. కాగా ధర్మశాల వాతావరణం కూడా కీలకం కానుంది. 15 నుండి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ సమయంలో చలి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, మ్యాచ్ 5వ రోజు వర్షం పడే అవకాశం ఉంది. ధర్మశాల హెచ్‌పీసీఏ స్టేడియంలో టీ20, వన్డే మ్యాచ్ లు ఎక్కువగానే జరిగినప్పటికీ.. టెస్టు మ్యాచ్ మాత్రం ఒక్కటి మాత్రమే జరిగింది. ఆ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. యావరేజ్ స్కోర్ 300 నుంచి 332 పరుగులుగా ఉన్న నేపథ్యంలో బ్యాటర్లు కాస్త ఓపికగా ఆడాల్సి ఉంటుంది.