Kohli’s re-entry : కోహ్లీ రీ ఎంట్రీ ఎప్పుడో నాకెలా తెలుస్తుంది.. కోచ్ ద్రావిడ్ షాకింగ్ కామెంట్స్
వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ (England) తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రీఎంట్రీపై రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అందుబాటులోకి వచ్చే విషయం తనకేలా తెలుస్తుందనన్నాడు. అతని గురించి తన కంటే సెలెక్టర్లను అడగడం ఉత్తమమని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ (England) తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రీఎంట్రీపై రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అందుబాటులోకి వచ్చే విషయం తనకేలా తెలుస్తుందనన్నాడు. అతని గురించి తన కంటే సెలెక్టర్లను అడగడం ఉత్తమమని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో గెలిచిన భారత్ సిరీస్ ను 1-1తో సమం చేసింది. తర్వాతి మ్యాచ్ రాజ్ కోట్ లో జరగనుండగా… అందరి దృష్టి కోహ్లీపైనే ఉంది. కోహ్లీ మూడో టెస్ట్ నుంచి జట్టులోకి వస్తాడా అనే ప్రశ్న ద్రావిడ్ కు ఎదురైంది. దీనిపై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ రీఎంట్రీపై తన కంటే సెలెక్టర్లను అడగడం ఉత్తమం అన్నాడు. తన కంటే కంటే సెలెక్టర్లకే బాగా తెలుసుంటుందంటూ వ్యాఖ్యానించాడు.
అయితే ద్రావిడ్ కామెంట్స్ పై విమర్శలు వస్తున్నాయి. జట్టులో కీలక ఆటగాడు ఎప్పుడు వస్తాడనే దానిపై కోచ్ కు సమాచారం లేకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కోహ్లీ రీఎంట్రీపై బీసీసీఐకి క్లారిటీ లేకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. మూడో టెస్ట్ గురించి కోహ్లీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.అయితే అందుబాటులో ఉండనని మాత్రం కోహ్లీ చెప్పలేదని, అతను ఏం చెప్పలేదంటే సెలెక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లేనని చెబుతున్నారు.