T20 WORLD CUP: వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదేనా.. వారికి ఛాన్స్ గ్యారెంటీ..

15 మందితో కూడిన జట్టును మరో రెండు వారాల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అప్పటికి ఐపీఎల్‌లో దాదాపు సగం మ్యాచ్‌లు ముగుస్తాయి. ప్లేయర్ల ఫామ్‌, ఫిట్‌నెస్‌ను కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోనున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2024 | 01:36 PMLast Updated on: Apr 10, 2024 | 1:36 PM

Icc T20 World Cup India To Announce Squad Soon Here Is The Team Members List

T20 WORLD CUP: ఐపీఎల్ 17వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. పలువురు యువ ఆటగాళ్ళు సత్తా చాటుతున్నారు. కాగా ఈ మెగా లీగ్‌ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ20 ప్రపంచ కప్‌ మొదలుకానుంది. జూన్ 1 నుంచి ఆరంభం కానున్న పొట్టి ప్రపంచకప్‌కు విండీస్ – యూఎస్‌ఏ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే ఏ దేశమూ ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమ్‌ ఇండియా బరిలోకి దిగుతుందని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అయితే భారత జట్టు ఎంపికపై దాదాపు కసరత్తు పూర్తయింది.

Hepatitis Viral : ప్రపంచంలో ఈ వ్యాధి డేంజర్… రోజుకి 3500 మంది మృతి !

15 మందితో కూడిన జట్టును మరో రెండు వారాల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అప్పటికి ఐపీఎల్‌లో దాదాపు సగం మ్యాచ్‌లు ముగుస్తాయి. ప్లేయర్ల ఫామ్‌, ఫిట్‌నెస్‌ను కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ప్రకారం స్క్వాడ్‌లో సీనియర్లకే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ ఆడటం ఖాయమైంది. రెండు లేదా మూడు మార్పులు మాత్రమే ఉండనున్నాయి. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా మారిన మయాంక్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా. అతడు ఫిట్‌గా ఉండటమూ చాలా కీలకం.

దాదాపు 15 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రిషభ్‌ పంత్‌తోపాటు రింకు సింగ్‌, యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కనుంది. మే 1 నాటికి ప్రతీ టీమ్ తమ జట్టు ప్రాబుబల్స్‌ను ఐసీసీ కమిటీకి పంపించాలి. ఆ తర్వాత మే 25 వరకు అందులో ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవడానికి ఛాన్స్‌ ఉంటుంది. కాగా గత వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరిన టీమ్‌ ఇండియా రన్నరప్‌గా నిలిచింది. దాదాపు పదేళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీ కోసం భారత్‌కు నిరీక్షణ తప్పడం లేదు. ఈసారైనా ఆ నిరీక్షణకు తెరదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వరల్డ్‌కప్‌కు భారత జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ లేక చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్ లేక మయాంక్‌ యాదవ్.