Stop Clock: క్రికెట్‌లో కొత్త రూల్.. బౌలింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ..
బౌలింగ్ జట్టు తదుపరి ఓవర్ మొదటి బంతిని 60 సెకన్లలోపు వేయడానికి సిద్ధంగా ఉండాలి. బౌలింగ్ జట్టు ఒక ఇన్నింగ్స్‌లో మూడు సార్లు 60 సెకన్లలోపు సిద్ధంగా లేకుంటే, వారు అపోజిషన్ జట్టుకు పెనాలిటీ రూపంలో ఐదు పరుగులను అదనంగా అందించిన వాళ్లవుతారు.
Stop Clock: పురుషుల ODI మరియు T20I మ్యాచ్‌లలో ఆట వేగాన్ని నియంత్రించడానికి “స్టాప్ క్లాక్” నియమాన్ని ట్రయల్ చేస్తోంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఈ నియమం ఉదేశ్యం ఏంటంటే, ఆటలో వేగాన్ని పెంచి, అనవసరంగా సమయాన్ని వృధా చేయకూడదు అనేది. బౌలింగ్ జట్టు తదుపరి ఓవర్ మొదటి బంతిని 60 సెకన్లలోపు వేయడానికి సిద్ధంగా ఉండాలి. బౌలింగ్ జట్టు ఒక ఇన్నింగ్స్‌లో మూడు సార్లు 60 సెకన్లలోపు సిద్ధంగా లేకుంటే, వారు అపోజిషన్ జట్టుకు పెనాలిటీ రూపంలో ఐదు పరుగులను అదనంగా అందించిన వాళ్లవుతారు.
Google Most Searches in India: గూగుల్ లో ఎక్కువ వెతికిన సమాచారం ఏదో తెలుసా ?
ICC డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ స్టాప్ క్లాక్ రూల్‌ను ప్రయోగాత్మకంగా అమల చేయనుంది. ఈ రూల్‌ను మంగళవారం జరగబోయే విండీస్, ఇంగ్లాండ్ జట్ల మీద ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ నియమాన్ని గతంలో 2018లో MCC వరల్డ్ క్రికెట్ కమిటీ ప్రతిపాదించింది. ఈ కమిటీలో మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, కుమార సంగక్కర ఉన్నారు. ఈ నిర్ణయం, అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి ప్రభావాన్ని చూపెడుతుందని, క్రికెట్ క్రిటిక్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.