U19 World Cup 2024: ఇక కుర్రాళ్ల ప్రపంచకప్.. టైటిల్ ఫేవరెట్‌గా భారత్
ఈ టోర్నీలో భారత్ 2000, 2008, 2012, 2018, 2022లో విజేతగా నిలిచింది. అన్నింటికీ మించి రైనా, యువరాజ్ సింగ్, కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ వంటి ప్లేయర్స్ అంతా అండర్ 19 వరల్డ్ కప్‌లో సత్తా చాటి వెలుగులోకి వచ్చినవారే.

U19 World Cup 2024: సౌతాఫ్రికా వేదికగా అండర్ 19 ప్రపంచకప్‌కు అంతా సిద్ధమైంది. నేటి నుంచి ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు తలపడుతుండగా.. ఎప్పటిలానే భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్‌కు తిరుగులేని రికార్డుంది. ఐదుసార్లు టైటిల్ గెలిచిన రికార్డు మన జట్టుదే. ఈ టోర్నీలో భారత్ 2000, 2008, 2012, 2018, 2022లో విజేతగా నిలిచింది.
SURYAKUMAR YADAV: సూర్యకుమార్ సర్జరీ సక్సెస్.. రీ ఎంట్రీ ఇచ్చేది అప్పుడే
అన్నింటికీ మించి రైనా, యువరాజ్ సింగ్, కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ వంటి ప్లేయర్స్ అంతా అండర్ 19 వరల్డ్ కప్‌లో సత్తా చాటి వెలుగులోకి వచ్చినవారే. దీంతో ఈ సారి ఎవరు సత్తా చాటుతారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పంజాబ్ కుర్రాడు ఉదయ్ సహరన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భారత యువ జట్టుపై ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి భారత అండర్-19 జట్టుకు ఎంపికైన అరవెల్లి అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్.. సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ మెగా టోర్నీలో రాణిస్తే ఇటు జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిలోనే కాకుండా, అటు ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకట్టుకోవచ్చు. కాగా ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను శనివారం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఇదే గ్రూపులో ఐర్లాండ్, అమెరికా జట్లు ఉండగా.. సూపర్ సిక్స్, సెమీ ఫైనల్ స్టేజ్ దాటడం యువ భారత్ జట్టుకు పెద్ద కష్టం కాదు.