India U19: కుర్రాళ్లకూ దెబ్బేసిన కంగారులు.. యువ భారత్ ఓటమికి కారణాలివే
ఫైనల్లో ఏజట్టుకైనా ఉండే ఒత్తిడిని యంగ్ ఇండియా తట్టుకోలేపోయింది. ముఖ్యంగా ఛేజింగ్‌లో అది స్పష్టంగా కనిపించింది. తొలి రెండు ఓవర్లలో కేవలం ఒక పరుగే చేసింది. తర్వాత టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు.

India U19: అండర్ 19 ప్రపంచకప్ టైటిల్ ఫైట్‍లో భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఫైనల్ వరకు అజేయంగా దూసుకొచ్చిన యంగ్ టీమిండియా.. తుదిపోరులో చతికిల పడింది. భారత్ యువ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడే. ఫైనల్లో ఏజట్టుకైనా ఉండే ఒత్తిడిని యంగ్ ఇండియా తట్టుకోలేపోయింది. ముఖ్యంగా ఛేజింగ్‌లో అది స్పష్టంగా కనిపించింది. తొలి రెండు ఓవర్లలో కేవలం ఒక పరుగే చేసింది. తర్వాత టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు.
Virat Kohli: కోహ్లీ రీ ఎంట్రీ ఎప్పుడంటే..
ఆసీస్ పేస్ ఎటాక్ మరీ భీభత్సంగా లేకున్నా అనవసర ఒత్తిడికి గురై బ్యాట్లెత్తేశారు. ఫైనల్ ముందు వరకూ అదరగొట్టిన ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్ సహరన్, సచిన్ దాస్.. ఫైనల్‌లో నిరాశపరిచారు. మిగిలిన బ్యాటర్లు కూడా వీరి బాటలోనే నడిచారు. 100 పరుగులలోపే 6 వికెట్లు కోల్పోవడంతో అక్కడే ఓటమి ఖాయమైపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేసే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. మూడో ఓవర్లోనే ఆసీస్ తొలి వికెట్ పడగొట్టినా అదే జోరు కొనసాగించలేకపోయారు మన బౌలర్లు. మధ్యమధ్యలో మన బౌలర్లు వికెట్లు తీసినా ఆసీస్ లోయర్ ఆర్డర్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపడంలో భారత యువబౌలర్లు విఫలమయ్యారు.
ఇక ప్రపంచకప్ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమికి ఆస్ట్రేలియా బ్యాటర్ హర్జాస్ సింగ్ ఓ ప్రధాన కారణం. బ్యాటింగ్‌లో అర్ధశతకంతో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అయితే ఈ హర్జాస్ సింగ్ భారత సంతతికి చెందినవాడే. ఈ ప్రపంచకప్‌లో ఫైనల్ ముందు వరకూ అతను గొప్పగా రాణించింది లేదు. టైటిల్ పోరులో మాత్రం 55 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్‌ను దెబ్బకొట్టాడు.