ICC WORLD CRICKET CUP: మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా… గిల్ ఔట్ !
భారత్ - ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న ICC వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా మొదటి వికెట్ కోల్పోయింది

ICC WORLD CUP: భారత్ – ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న ICC వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా మొదటి వికెట్ కోల్పోయింది. గిల్ 3 పరుగులకు ఔట్ అయ్యాడు. 30పరుగులకు మొదటి వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియన్ బౌలర్ స్టార్క్ ఈ వికెట్ తీశాడు. గిల్ ఫోర్ కి ప్రయత్నించడంతో ఆడమ్ క్యాచ్ పట్టాడు. తర్వాత కోహ్లీ క్రీజ్ లోకి వచ్చాడు.
మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ఫోర్స్ తో చెలరేగిపోతున్నాడు. అహ్మదాబాద్ స్టేడియంలో ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. టీమిండియాకు భారీగా మద్దతు పలుకుతున్నారు. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండ్లు జట్లు కూడా ఎలాంటి మార్పులు లేకుండా పాత వాళ్ళే కొనసాగిస్తున్నారు.