ICC WORLD CRICKET CUP: విరాట్ కోహ్లీ ఔట్… బరువెక్కిన అభిమానుల హృదయాలు !
ఇండియా - ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లో చివరిదాకా ఉండి జట్టును గెలిపిస్తాడు అనుకున్న విరాట్ కోహ్లీ ఔట్ తో భారతీయ అభిమానులు నిరాశ చెందారు.

ICC వరల్డ్ కప్ :
ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ వేసిన ఓ షార్ట్ బాల్ కి విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. దాంతో విరాట్ కోహ్లీ కొద్దిసేపు క్రీజ్ లోనే ఉండి చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అందరి ముఖాల్లో విషాదం కనిపించింది. స్టేడియంలోనే కాదు టీవీల్లో మ్యాచ్ చూస్తున్న సగటు భారతీయుడి గుండె బరువెక్కింది. భారత్ మొదటి మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కేఎల్ రాహుల్ తో కలసి… విరాట్ అద్భతమైన పార్టనర్షిప్ ను అందించాడు. హాప్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. కానీ దురదృష్టవశాత్తు కోహ్లీ అవుట్ అవ్వడంతో… ఆయన స్థానంలో జడేజా బ్యాటింగ్ కి వచ్చాడు. ఇప్పుడు భారత్ జట్టు స్కోర్ పెంచే బాధ్యత రాహుల్ – జడేజా ద్యయం మీద పడింది.