WORLD CUP 2023: ఎటూ తేల్చుకోలేపోతున్న టీమిండియా.. ప్రయోగాలు చేయాలా..? వద్దా..?
రేపు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. గతంతో పోల్చితే బంగ్లాదేశ్ కాస్త వీక్‌గా కనిపిస్తున్న మాట వాస్తవమే. అయితే ఎవర్నీ తక్కువగా చూడటానికి లేదు. లైట్ తీసుకుంటే అంతే సంగతి. అందులోనూ ఇప్పటికే ప్రపంచకప్‌లో రెండు పెను సంచలనాలు నమోదయ్యాయి.

Team India achieved a rare record by winning the ODI match against Australia
WORLD CUP 2023: వరల్డ్‌కప్‌లో భాగంగా రేపు బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్‌కు ఓటమే లేదు. అందుకే రేపటి మ్యాచ్‌లో ప్రయోగాలు చేయాలని భావిస్తోంది. అలాగని బంగ్లాదేశ్‌ని తక్కువ అంచనా వేస్తే బొక్క బోర్లా పడడం ఖాయం. 2007 ప్రపంచకప్ గుర్తింది కదా. ఆ తర్వాత 2012 ఆసియా కప్‌లోనూ భారత్‌ను ఇంటిదారి పట్టించారు బంగ్లా టైగర్స్. రేపు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. గతంతో పోల్చితే బంగ్లాదేశ్ కాస్త వీక్‌గా కనిపిస్తున్న మాట వాస్తవమే. అయితే ఎవర్నీ తక్కువగా చూడటానికి లేదు.
లైట్ తీసుకుంటే అంతే సంగతి. అందులోనూ ఇప్పటికే ప్రపంచకప్‌లో రెండు పెను సంచలనాలు నమోదయ్యాయి. ఇవన్ని టీమిండియా ఆలోచిస్తుందో లేదో కానీ.. రేపటి మ్యాచ్‌కు కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ మనకు ఆస్ట్రేలియాతో జరగగా.. ఆ మ్యాచ్‌లో బరిలోకి దిగిన అశ్విన్ తర్వాత మళ్లీ కనిపించలేదు. అఫ్గాన్, పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లకు అశ్విన్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. కుల్దీప్ యాదవ్, జడేజా స్పిన్ భారాన్ని మోశారు. రేపు పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్ స్పిన్‌కి అనుకూలించేలా ఉంటుందని సమాచారం. ఒకవేళ అదే నిజమైతే శార్దుల్ ఠాకుర్ ప్లేస్‌లో అశ్విన్‌ని ఆడించాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోందని తెలుస్తోంది. అప్పుడు పేసర్లుగా బుమ్రా, సిరాజ్‌తో పాటు ముగ్గురు స్పిన్నర్లు, హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తారు.
మరోవైపు పిచ్ బ్యాటింగ్‌కి పూర్తిగా అనుకూలంగా ఉంటే మాత్రం శార్దుల్‌నే ఆడిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే షమీని కూడా టీమ్‌లో ఆడించాలన్న ఆలోచనలో రోహిత్ శర్మ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గెలుస్తున్న టీమ్‌తో కాకుండా ఇలా టీమ్ కూర్పును మార్చడం కరెక్ట్ కాదు అని ఫ్యాన్స్ అంటుండగా.. ఇది అసలు ప్రయోగమే కాదని మరికొందరు అంటున్నారు. ఎందుకంటే షమి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అటు సిరాజ్, బుమ్రా అదిరే ఫామ్‌లో ఉన్నారు. శార్దుల్ బ్యాటింగ్, బౌలింగ్ కోటాలో జట్టులో ఉన్నాడు. ఎలాగో శార్దుల్ బ్యాటింగ్‌కి దిగేలోపే మ్యాచ్ ఫినిష్ ఐపోతుందని, కాబట్టి అతని బదులు షమిని ఆడిస్తే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పుడు జట్టు బౌలింగ్ లైనప్ కూడా యమ స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది.
టీమిండియా (అంచనా): శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/మహ్మద్ షమీ/శార్దుల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్.