ICC WORLD CUP: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నఆస్ట్రేలియా… జట్టులో ఎలాంటి మార్పులు లేవు !
భారత్ ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ICC వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
వరల్డ్ కప్ హైలెట్స్
• అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా ICC వరల్డ్ కప్ ఫైనల్స్
• టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా. మొదట బ్యాటింగ్ చేయనున్న ఇండియా జట్టు
• వరల్డ్ కప్ లో 14వ సారి తలపడుతున్న భారత్ – ఆస్ట్రేలియా
• 500 మంది డ్యాన్సర్లతో ప్రదర్శన
• సెకండ్ ఇన్నింగ్స్ డ్రింక్స్ లో లేజర్ షో
• ఫైన్ మ్యాచ్ ను చూస్తున్న ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని
• భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు వాడిన పిచ్‌నే ఫైనల్ కి సిద్ధం
• నల్లరేగిడితో చేసిన పిచ్, బౌన్స్ తక్కువగా ఉండటంతోపాటు బంతి నెమ్మదిగా తిరిగే అవకాశం
• ఈ వరల్డ్ కప్‌లో 4 మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన జట్టే 3సార్లు విజేత
• నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 251.
• నరేంద్రమోడీ స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూస్తున్న 1.30 లక్షల మంది ప్రేక్షకులు
• టోర్నీలో ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌ల్లో 8 లో విజయం
• 10 మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన
• విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో 711 పరుగులు, మహమ్మద్ షమీ 23 వికెట్లతో టాపర్లు